రెఢీ కండి.. రేపు సుదీర్ఘ‌మైన ప‌గ‌లు

Update: 2017-06-20 09:29 GMT
రేప‌టి రోజు (బుధ‌వారం)కు చాలా స్పెష‌ల్ ఉంది. ప్ర‌పంచ వ్యాప్తంగా అతిపెద్ద ప‌గ‌టి పూట‌ రేపు ప్ర‌పంచ ప్ర‌జ‌ల అనుభ‌వంలోకి రానుంది. సాధార‌ణంగా ఉద‌యం ఆరు గంట‌ల నుంచి సాయంత్రం ఆరు గంట‌లు అంటే ప‌న్నెండు గంట‌ల పాటు ప‌గ‌లుగా ఉండ‌టం చూస్తుంటాం. అయితే..కొన్ని ప్రాంతాల్లో అది ఎనిమిది గంట‌లు మాత్ర‌మే ఉంటుంది. అయితే.. రేప‌టి స్పెష‌ల్ ఏమిటంటే.. ప‌గ‌లు అటూ ఇటూగా 13 గంట‌ల ఏడు నిమిషాల పాటు ఉండ‌నుంది. అంటే.. పొద్దున్నే తెల్ల‌వారు కావ‌ట‌మే కాదు.. సాయంత్రం కూడా ఎక్కువ సేపు ప‌గ‌లు మాదిరి ఉండ‌నుంద‌న్న మాట‌.

భూభ్ర‌మ‌ణంలో ఉండే తేడా కార‌ణంగా ఇలాంటిది అప్పుడ‌ప్పుడు చోటు చేసుకుంటూ ఉంటుంది. రేప‌టి రోజున తెల్ల‌వారుజామున 5.34 గంట‌ల‌కు తెల‌వార‌నుంది. ఇలా మొద‌ల‌య్యే ప‌గ‌లు రేపు సాయంత్రం 6.41 గంట‌ల వ‌ర‌కూ ఉండ‌నున్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌తి ఏడాది జూన్ 20.. 21 తేదీల్లో ఇలాంటిది చోటు చేసుకుంటూ ఉంటుంది. ఇదేతేదీల్లో జ‌రిగే మ‌రో కీల‌క మార్పు ఏమిటంటే.. ఉత్త‌ర‌ అర్థ‌గోళంలో ఉండే యూకే.. యూఎస్‌..ర‌ష్యా.. కెన‌డా.. భార‌త్‌.. చైనాలో వేస‌వి ముగిస్తే.. ఆస్ట్రేలియా.. అర్జెంటీనా..చిలీ.. న్యూజిలాండ్ ల‌లో మొద‌లు కానుంది. ఇక‌.. సుదీర్ఘ‌మైన ప‌గ‌టి రోజున దేశంలో తొలి సూర్యోద‌యం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ లోని ఉజ్జ‌యినిలో జ‌రిగితే.. తెలుగు రాష్ట్రాల్లో కృష్ణాజిల్లా గుడివాడ‌లో జ‌ర‌గ‌నుంద‌ని చెబుతున్నారు. మ‌రీ.. సుదీర్ఘ‌మైన ప‌గ‌టిని చూడ‌టానికి రెఢీ కండి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News