సుర్యూడు నిత్యం వేడిని కక్కుతూ భగ భగ మండుతుంటాడు. కానీ , గత కొన్ని రోజులుగా సూర్యడు కొంచెం చల్లబడినట్టు అర్థమౌతుంది. ఈ ఏడాది మార్చి 24వ తేదీ నుంచి అంటే.. 264 రోజుగా పెద్దగా తన ప్రభావం చూపలేదు. ఇలాగే మరో 4 రోజులు దాటితే ఇది కొత్త రికార్డే అవుతుంది అని నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇంతకీ సూర్యుని వేడి తగ్గిపోవడం ఏంటి ? అంటే..సూర్యుడిలో ప్రతి 11 ఏళ్ళకి ఒకసారి సోలార్ సైకిల్ పూర్తయితదని సైంటిస్టుల అంచనా. ఈ సోలార్ సైకిల్ ప్రారంభంలో సోలార్ మ్యాగ్జిమం - ముగింపులో సోలార్ మినిమం అనే రెండు దశలు కొనసాగుతాయి. ప్రస్తుతం 24వ సోలార్ సైకిల్ నడుస్తోందని - అందులో సూర్యుడు సోలార్ మినిమం స్టేజ్ లో ఉన్నాడని చెప్తున్నారు.
2023 నుంచి 25వ సోలార్ సైకిల్ మొదలై - 2025 కల్లా సూర్యు డు మళ్లీ భీకరంగా మారిపోతాడని చెప్తున్నారు. 2008లో సోలార్ మినిమం స్టేజ్ 268 రోజులు కొనసాగిందని - ఇప్పటివరకూ అదే సు దీర్ఘ సోలార్ మినిమం స్టేజ్ అని సైంటిస్టులు తెలిపారు. సూర్యుడు బాగా యాక్టివ్ గా ఉన్నప్పుడు అయస్కాంత క్షేత్రం చాలా బలంగా ఉంటుంది. ఉపరితలంపై నల్లటి మచ్చల్లా సన్ స్పాట్స్ ఎక్కువగా ఏర్పడుతుంటాయి.
ఒక్కోసారి ఇవి గురు గ్రహం అంత సైజు కూడా ఉంటుంటాయి. అలాగే భారీఎత్తు న సోలార్ ఫ్లేర్స్ అంతరిక్షంలోకి ఎగిసిపడుతుంటాయి. అయితే, సోలార్ మినిమం స్టేజ్ లో సూర్యుడి అయస్కాంత క్షేత్రం చాలా వీక్ అవుతుంది.అందువల్ల ఉపరితలంపై సన్ స్పాట్స్ చాలా వరకూ తగ్గిపోతాయి. దీంతో సూర్యుడు ప్రశాంతంగా కనిపిస్తాడు. భూమిని తాకే వేడి కూడా కొంతవరకు తగ్గుతుంది.