ఉక్కతో అతిధుల ఉక్కిరిబిక్కిరి

Update: 2015-10-22 07:11 GMT
ఏర్పాట్లు ఎంత గొప్ప‌గా చేసినా.. స‌హ‌జ‌సిద్ధంగా ఉండే వాతావ‌ర‌ణాన్ని ఎవ‌రూ మార్చ‌లేరు. ఆ విష‌యం అమ‌రావ‌తి శంకుస్థాప‌న కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన అతిధుల‌కు అర్థ‌మైన ప‌రిస్థితి. అమ‌రావ‌తి రాజ‌ధాని శంకుస్థాప‌న కోసం ఏపీ స‌ర్కారు భారీగా ఏర్పాట్లు చేసింది. కార్య‌క్ర‌మానికి విచ్చేసే అతిధుల‌కు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా ఉండేందుకు వీలుగా చాలానే జాగ్ర‌త్త‌లు తీసుకుంది.

అతిధులు.. ప్ర‌జ‌లు శంకుస్థాప‌న కార్య‌క్ర‌మానికి చేరుకునేందుకు దీసుకోవాల్సిన అన్నీ జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌టంతో  పాటు.. ఎవ‌రు ఎప్పుడు రావాలి.. వ‌చ్చిన వారు ఎక్క‌డ కూర్చోవాలి లాంటి అంశాల‌తో పాటు.. ఎవ‌రికి ఏమేం ఇవ్వాలి లాంటి విష‌యాల‌కు సంబంధించి చాలానే జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు.

ఇన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ అమ‌రావ‌తి ప్రాంతంలో ఉండే స‌హ‌జ‌సిద్ధ‌మైన వాతావ‌ర‌ణంలో ఉండే తేమ శాతం కార‌ణంగా విప‌రీత‌మైన ఉక్క‌తో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. స‌భాప్రాంగంలో వీవీఐపీల‌కు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో ఏసీలు భారీగా ఏర్పాటు చేయ‌టంతో పెద్ద‌గా ఇబ్బంది క‌ల‌గ‌న‌ప్ప‌టికీ.. సామాన్యులు.. ఓ మోస్త‌రు ప్ర‌జ‌లుమాత్రం ఉడుకుతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.క‌ర్చీఫ్ లు.. చేతిలో ఉన్న వ‌స్తువుల‌తో విసురుకోవ‌టం క‌నిపించింది.  అమ‌రావ‌తి ప్రాంతంలో ఉండే వేడి.. అమ‌రావ‌తి అతిధుల‌ను ఇబ్బంది పెట్టింద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.
Tags:    

Similar News