కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. గెలుపు.. ఓటములు మామూలే. అయితే.. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కాస్త ఆగితే.. అదే సర్దుకుంటుంది. ఆ విషయం ఇప్పుడు మరోసారి నిరూపితమైంది. తమిళనాడులో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు స్టాక్ మార్కెట్లో కొన్ని షేర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.
గడిచిన ఐదేళ్లుగా కాల పరీక్షను ఎదుర్కొన్న సన్ టీవీ షేర్లు తాజాగా మెరిసిపోయాయి. ఎగ్జిట్ పోల్ లో తమిళనాడులో డీఎంకే అధికారపీఠాన్ని చేజిక్కించుకోవటం ఖాయమని తేల్చేసిన నేపథ్యంలో సన్ టీవీ షేర్లకు ‘పవర్’ తోడైంది. దీంతో.. 9.5 శాతానికి పైగా లాభంతో సన్ టీవీ షేర్లు పెరిగిపోయాయి.
ఈ షేరు జోరు మరింతగా ఉంటుందన్న అంచనాలు మార్కెట్ వర్గాలు వేస్తున్నాయి. పరిస్థితులన్నీ అనుకూలిస్తే సన్ టీవీ షేర్లు రూ.540 వరకూ వెళ్లినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. తమిళనాడులో అధికార బదిలీతో పాటు.. సన్ టీవీ మార్చి త్రైమాసికంలో లాభాలు సాధిస్తుందన్న అంచనాలు కూడా సన్ తాజా మెరుపులకు కారణంగా చెబుతున్నారు.