కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి హై కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. మే 31న ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ హై కోర్టు కీలకమైన తీర్పుని వెలువరించింది. దీంతో అవినాష్ సహా వైసీపీ శ్రేణులు అన్నీ ఊపిరి పీల్చుకున్నాయి.
అయితే ఈ కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ కోసం ఎందాకైనా అన్నట్లుగా అలుపు లేని న్యాయ పోరాటం చేస్తున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. హై కోర్టు అవినాష్ రెడ్డికి ఇచ్చిన ముందస్తు బెయిల్ ని రద్దు చేయాలని కోరుతూ ఆమె సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఇపుడు ఈ కేసు కొత్త మలుపు తిరిగింది.
అవినాష్ రెడ్డి కేసు విషయంలో హై కోర్టు ముందస్తు బెయిల్ ఇస్తూ ఇచ్చిన తీర్పును ఆమె సుప్రీం కోర్టులో ఈ విధంగా సవాల్ చేశారు. ఈ సందర్భంగా ఆమె అవినాష్ రెడ్డి మీద ఉన్నవి తీవ్రమైన అభియోగాలు అని పేర్కొనడం విశేషం. ఈ కేసులో సీబీఐ అభియోగాలను హై కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని ఆమె తన పిటిషన్ లో పేర్కొనడం విశేషం.
అంతే కాదు హై కోర్టు తీర్పులో లోపాలు ఉన్నాయని ఆమె చెప్పడం విశేషం. ఇదిలా ఉండగా సుప్రీం కోర్టు వెకేషన్ బెంచ్ ఈ కేసుని విచారించే అవకాశం ఉంది. హై కోర్టు ముందస్తు బెయిల్ ఇస్తూ అవినాష్ రెడ్డికి ఉపశమనం కలిగిస్తే సుప్రీం కోర్టులో ఏ రకమైన తీర్పు వస్తుందో అన్న ఉత్కంఠ అయితే ఉంది.
ఇక ఈ కేసు విషయంలో సీబీఐకి సుప్రీం కోర్టు ఇచ్చిన గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది. ఈ కేసుకు సంబంధించి అందరినీ సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే అవినాష్ రెడ్డి అరెస్ట్ మాత్రం జరగలేదు. ఆయన అరెస్ట్ అయి తీరుతారని అంతా అనుకున్నా ముందస్తు బెయిల్ ని ఆయన హై కోర్టులో పొందడంతో అక్కడితో ఆగిపోయింది.
మరో ఇరవై రోజులలో ఈ కేసులో సీబీఐ విచారణ కూడా పూర్తి కానుంది. దీంతో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలన్న పట్టుదలతోనే సునీత సుప్రీం కోర్టు దాకా వెళ్తున్నారు అని అంటున్నారు. మరి సుప్రీం కోర్టులో సీబీఐ ఏ రకంగా వాదనలు వినిపిస్తుంది. అవినాష్ రెడ్డి లాయర్లు ఏ రకంగా వాదిస్తుంది, తీర్పు ఎలా వస్తుంది అన్నది ఆసక్తిని రేపుతున్న వ్యవహారంగా ఉంది. మొత్తం మీద చూసుకుంటే సునీతారెడ్డి ఈ కేసు విషయంలో ఎక్కడా తగ్గేదే లే అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు.