వార్నర్ కి ఘోర అవమానం .. దానికి కూడా అవకాశం ఇవ్వలేదట !

Update: 2021-10-11 13:00 GMT
సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ కు ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాయని మచ్చలా తయారైంది. కెప్టెన్సీ పదవి పోయింది, అనంతరం టీం నుంచి కూడా స్థానం కోల్పాయాడు. దీంతోపాటు సన్‌రైజర్స్ టీం మేనేజ్‌మెంట్ కూడా వార్నర్‌‌తో దారుణంగా ప్రవర్తించిన తీరు కూడా దారుణంగా ఉంది. వార్నర్ తన మొదటి ఆరు గేమ్‌లలో ఒక విజయాన్ని మాత్రమే సాధించడంతో SRH కెప్టెన్‌గా కేన్ విలియమ్సన్‌ను నియమించారు. కరోనా వైరస్ కారణంగా టోర్నమెంట్ వాయిదా వేయడానికి ముందు SRH టీం ఏడవ గేమ్ ప్లేయింగ్ XI నుంచి తప్పుకున్నాడు.

 UAE లెగ్‌ లో ఎస్‌ ఆర్‌ హెచ్‌ మొదటి రెండు ఆటల్లో ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మన్  ప్లేయింగ్  XIలోకి తిరిగి వచ్చాడు. అయితే ఆ తరువాత మళ్లీ టీం నుంచి డ్రాప్ అయ్యాడు. టోర్నమెంట్ తరువాతి దశలో వార్నర్ మిగిలిన స్క్వాడ్‌తో స్టేడియానికి వెళ్లలేకపోయాడు. ఎస్‌ ఆర్‌ హెచ్ మాజీ కెప్టెన్‌ తో ఫ్రాంఛైజీ వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌‌కు కూడా కోపం తెప్పించింది. శనివారం ఎస్‌ ఆర్‌ హెచ్‌ టీం ఐపీఎల్ 2021 లీగ్ దశ ముగిసిన తర్వాత అభిమానుల కోసం వీడ్కోలు వీడియోను విడుదల చేసింది. ఈ ఏడాది ప్లేఆఫ్స్‌ చేరుకోవడంలో విఫలమయింది. సోషల్ మీడియాలో ఆరెంజ్ ఆర్మీ షేర్ చేసిన వీడియోలో వార్నర్ కనిపించలేదు. వార్నర్ లేకపోవడంపై అభిమానులు ప్రశ్నలపై ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ మేరకు ఓ అభిమాని ఒకరు వార్నర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ట్యాగ్ చేసి వీడ్కోలు వీడియోలో ఎందుకు లేరంటూ ఓ ప్రశ్న అడిగారు.

దీనితో ఆస్ట్రేలియన్ స్టార్ స్పందిస్తూ వీడియోలో మాట్లాడమని తనను అడగలేదంటూ పేర్కొన్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఎస్‌ ఆర్‌ హెచ్ అత్యుత్తమ రన్నర్ అయిన వార్నర్, ఈ సీజన్‌ లో జట్టు కోసం కేవలం ఎనిమిది మ్యాచ్‌ లు మాత్రమే ఆడాడు. అయితే కేవలం 185 పరుగులు మాత్రమే చేశాడు. 2016లో ఎస్‌ ఆర్‌ హెచ్‌ ని ఐపీఎల్‌ టైటిల్‌ కి నడిపించిన ఏకైక కెప్టెన్ వార్నర్. మెగా వేలానికి ముందు వార్నర్‌ ఫ్రాంచైజీని విడుదల చేస్తుందో లేదో చూడాలి. అయితే, సన్‌ రైజర్స్ హైదరాబాద్ టీం ఈ ఏడాది ప్లేఆఫ్స్‌లో విఫలం కావడంతో మొత్తం జట్టును పునరుద్ధరించాలని చూస్తోంది.
Tags:    

Similar News