కరెంట్ తో నడిచే సూపర్ ​ఫాస్ట్ విమానాలు.. ఇక భవిష్యత్​ అంతా వీటిదేనా?

Update: 2020-10-05 02:30 GMT
విమానాల తయారీలో ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్నో సంస్థలు విమానాల తయారీలో తమ ప్రత్యేకత చూపేందుకు శ్రమిస్తున్నాయి.  ప్రముఖ ఆటోమొబైల్స్ కంపెనీ బ్రిటన్​కు చెందిన రోల్స్ రాయిస్‌ ఇప్పుడో అద్భుత ఆవిష్కరణ చేపట్టింది. ప్రస్తుతం ఉన్న విమానాలకంటే రెట్టింపు వేగంతో నడిచే అత్యున్నత నాణ్యతా ప్రమాణాలున్న విమానాలను తయారు చేయబోతోంది. ఈ విమానాలు కూడా విద్యుత్​ తోనే నడుస్తాయట. వీటితో పర్యావరణ కాలుష్యం ఉండదట. ఇప్పటికే పరీక్షలు పూర్తిచేసుకున్నాయి. ఈ విమానాలు గనక సక్సెస్​ అయితే భవిష్యత్​ అంతా వీటిదేనని చెబుతున్నారు విశ్లేషకులు. ఈ విమానాలు మామూలు  వాటికంటే అత్యంత వేగంగా వెళతాయని రోల్స్​ రాయీస్​ చెబుతోంది.

అందులో వినియోగించే టెక్నాలజీని కూడా ఇప్పటికే విజయవంతంగా పరీక్షించారు. ఈ విమానానికి ‘అయాన్‌ బర్డ్‌’గా నామకరణం చేసిన రోల్స్‌ చేశారు. రెప్లికా వెర్షన్‌ టెస్ట్‌ సంతృప్తికర ఫలితాలను ఇచ్చిందట. 500 హార్స్‌ పవర్‌ సామర్థ్యం ఉన్న విమానం క్షణాల్లో సూపర్​ వేగాన్ని అందుకోగలదని రోల్స్‌ రాయిస్‌ డైరెక్టర్‌ రాబ్‌ వాట్సన్‌ వివరించారు.ఈ విమానం టెక్నాలజీని పరీక్షించేందుకు ఉపయోగించిన విద్యుత్‌.. 250 ఇళ్లకు వినియోగించే విద్యుత్‌తో సరిసమానమని చెప్పారు. కరోనా నేపథ్యంలో డబ్ల్యూహెచ్​వో నిబంధనల ప్రకారమే టెస్ట్ నిర్వహించామని చెప్పారు. అతి త్వరలోనే అన్ని పరికరాలనూ విమానంలో అమర్చుతామని తెలిపారు. 2050 నాటికి ఈ తరహా విమానాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నట్టు సమాచారం.
Tags:    

Similar News