ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానీ గ్రూప్‌పై అమెరికా రిసెర్చ్ సంస్థ.. హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికతో స్టాక్ మార్కెట్ అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. దీనిపై దాఖలైన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు తాజాగా స్పందించింది. అదానీ సరే.. ఆయనను నమ్మి పెట్టుబడులు పెట్టిన స్టాక్‌మార్కెట్‌లో కొనుగోళ్లు చేసిన మధ్యతరగతి మదుపరులను ఎవరు కాపాడుతారు? అని సుప్రీంకోర్టు నిప్పులు చెరిగింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక నేపథ్యంలో భారీ నష్టాల్లో కూరుకుపోయారని, మదుపరులను కాపాడవలసిన అవసరం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఈ అంశంపై దేశంలో అమలవుతున్న నియంత్రణ వ్యవస్థల గురించి, తాజా పరిణామాల నేపథ్యంలో చేపట్టిన చర్యల గురించి వివరిస్తూ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, సెబీని ఆదేశించింది.
ఈమేరకు సీనియర్ న్యాయవాదులు ఎంఎల్ శర్మ, విశాల్ తివారీ దాఖలు చేసిన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. పైవిధంగా ఆదేశాలు జారీ చేసింది. అదానీ గ్రూప్‌పై షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ పన్నిన కుట్రపై న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని పిటిషనర్లు కోరారు.
అదానీ స్టాక్స్‌ను హిండెన్‌బర్గ్ షార్ట్ సెల్ చేసిందని, ఫలితంగా పెట్టుబడిదారులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు స్పందిస్తూ, హిండెన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో మార్కెట్ పతనమవడం వెనుక కారణాలపై నివేదికను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, సెబీని ఆదేశించింది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా నిరోధించేందుకు నియంత్రణ నిబంధనావళిని ఏ విధంగా పటిష్టపరచవచ్చునో సలహాలు ఇవ్వాలని కోరింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.