ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు ..ఏమైందంటే !

Update: 2020-03-23 10:10 GMT
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీ భవనాలకు వైసీపీ రంగులు వేయడంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే, సుప్రీం కోర్టులో కూడా జగన్ సర్కార్ కి ఎదురుదెబ్బ తగిలింది.  పంచాయతీ భవనాలకు వైసీపీ జెండా రంగులు వేయడంపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేయగా.. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేయడంతో ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా..కేంద్ర ప్రభుత్వ భవనాలకు కాషాయ రంగు వేస్తే ఒప్పుకుంటారా అంటూ ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాలను సమర్థిస్తూ పిటిషన్‍ ను కొట్టివేసింది సుప్రీంకోర్టు. కార్యాలయాలకు వేసే రంగుల అంశాన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యం కింద హైకోర్టులో విచారణ జరపడంపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై హైకోర్టులో జరిగిన విచారణలో భాగంగా.. గ్రామ సచివాలయ భవనాలకు రాజకీయ పార్టీల రంగులు తొలగించాలని ఆదేశించింది. పంచాయతీ భవనాలు, ప్రభుత్వ భవనాలకు సీఎస్‌ నిర్ణయం ప్రకారం పది రోజుల్లో మళ్లీ రంగులు వేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.దీన్ని సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. హైకోర్టు తీర్పునే సుప్రీంకోర్టు సమర్ధించింది. 
Tags:    

Similar News