బ్లూవేల్ పై నివేదిక‌కు సుప్రీం ఆదేశం!

Update: 2017-09-15 14:30 GMT
కొద్ది రోజులుగా దేశ‌వ్యాప్తంగా బ్లూ వేల్ గేమ్‌. పేరు దేశంలో మార్మోగిపోతోన్న‌సంగ‌తి తెలిసిందే. స‌ర‌దాగా మొద‌ల‌య్యే ఈ ఆట‌ చివ‌ర‌కు యువ‌త‌ ప్రాణాలు తీసేదాకా వ‌ద‌ల‌దు. ఇప్ప‌టికే ఈ వికృత క్రీడ బారిన ప‌డి దేశ వ్యాప్తంగా దాదాపు 200 మంది వ‌ర‌కు ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించారు. ఈ భ‌యాన‌క గేమ్ కు సంబంధించిన వెబ్ సైట్ల‌ను నిషేధించేందుకు కేంద్రం చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఆ చ‌ర్య‌లు ఫ‌లితాల‌నివ్వ‌క‌పోవ‌డంతో దేశంలో ఎక్క‌డో ఒక చోట బ్లూవేల్ ఆత్మహ‌త్యాయ‌త్నాల‌ వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. దీంతో,ఈ మ‌హ‌మ్మారి గేమ్ ను పూర్నిగా షేధించాల‌ని కోరుతూ దేశంలోనే అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీం కోర్టులో పిటిష‌న్ దాఖ‌లైన సంగ‌తి తెలిసిందే. ఆ పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఆ గేమ్ నిషేధించడానికి తీసుకుంటున్న చర్యలను తెలియజేస్తూ మూడు వారాల్లోగా నివేదిక సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది.


దేశ‌వ్యాప్తంగా బ్లూవేల్ గేమ్ ఎంతో మంది యువతను బలి తీసుకుంటోంద‌ని, ఆ గేమ్‌ను పూర్తిగా నిషేధించాల‌ని దాఖ‌లైన పిటిష‌న్ పై సుప్రీం కీల‌క‌మైన ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కేంద్రం ఇప్ప‌టివ‌ర‌కు చేప‌ట్టిన చర్యలను స్ప‌ష్టం చ‌స్తూ 3 వారాల్లోగా నివేదిక సమర్పించాల‌ని కేంద్రాన్ని ఆదేశించింది. జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం.ఖాన్‌ విల్కర్‌, జస్టిస్‌ డీవై. చంద్రచూద్‌తో కూడిన ధర్మాసనం శుక్ర‌వారం నాడు కేంద్రానికి ఆదేశాలు జారీచేసింది. న్యాయవాది ఎన్‌ఎస్‌. పొన్నయ్య బ్లూవేల్‌ గేమ్‌పై పూర్తిగా నిషేధం విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు.  ఇప్పటివరకు బ్లూవేల్ వ‌ల్దాల దాపు 200 మంది వరకు ఆత్మహత్యకు యత్నించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. బ్లూవేల్‌ గేమ్‌పై నిషేధం విధిస్తూ, ఈ గేమ్ పై  ప్రజలకు అవగాహన కల్పించాల‌ని కోరారు. అయితే, ఈ గేమ్ ను నిషేధించేందుకు కేంద్ర‌ఇప్పటికే చ‌ర్య‌లు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఆ గేమ్‌ లింక్‌లను సోష‌ల్ మీడియాలో నుంచి తొల‌గించాల‌ని  గూగుల్‌ను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

బ్లూవేల్‌.. ఓ అండర్‌ గ్రౌండ్‌ ఆన్‌ లైన్‌ గేమ్‌. ఈ గేమ్‌లో మొత్తం 50 టాస్క్‌లు ఉంటాయి. ప్రతీ టాస్క్‌ని పూర్తిచేస్తూ వాటికి సంబంధించిన ఫొటోలు తీసి ఆ గేమ్ అడ్మిన్ కు పోస్ట్‌ చేస్తుండాలి. న్యూడ్ ఫొటోలు షేర్ చేయ‌డం వంటి అస‌భ్య‌క‌ర‌మైన టాస్క్ లు కూడా ఈ గేమ్ లో భాగ‌మే.ఈ గేమ్ లో భాగంగా కొంత‌మందిని ఆత్మహ‌త్య చేసుకోవాల‌ని కూడా నిర్వాహ‌కులు ప్రేరేపిస్తుంటారు. ఒక‌సారి ఈ గేమ్ ఆడ‌డం మొద‌లుపెట్టాక వెన‌క్కు రాలేని స్థితిలోకి పార్టిసిపెంట్లు వెళ్లిపోతారు. పార్టిసిపెంట్ల‌ను మాన‌సికంగా లోబ‌రుచుకోవ‌డ‌మే ఈ గేమ్ ఉద్దేశం. ర‌ష్యాలో ఈ గేమ్ ఆడుతూ చాలా మంది ప్రాణాలు కోల్పోతుండ‌డంతో దీనిని నిర్వహించే వ్యక్తిని రష్యా పోలీసులు గ‌తంలో అరెస్టు చేశారు. ఈ పైశాచిక ఆన్ లైన్ గేమ్‌ ఆడుతూ వివిధ దేశాల్లో చాలామంది తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. కొద్దిరోజుల నుంచి ఈ గేమ్ బారిన ప‌డి భార‌త్ లో కూడా యువ‌త ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేప‌డంతో కేంద్రం ఆ గేమ్ ను నిషేధించేందుకు చ‌ర్య‌లు చేపట్టింది.
Tags:    

Similar News