ఉత్తరాది ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన ర్యాపర్ ధర్మేష్ పర్మార్ చిన్న వయసులోనే మృతి చెందాడు. బాలీవుడ్ స్టార్స్ తో కూడా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న ఈ యంగ్ ర్యాపర్ మృతి వార్త దేశ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు షాకింగ్ గా ఉంది. కేవలం 24 ఏళ్ల వయసు కుర్రాడు అయిన ధర్మేష్ పర్మార్ మృతి కి కారణం ఏంటీ అనేది ఇంకా తెలియరాలేదు.
పోలీసులు ఇప్పటికే అనుమానాస్పద మృతిగా కేసు ను ఫైల్ చేసి ఎంక్వౌరీ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ మీడియాలో ఈ విషయమై రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. అసలు విషయం ఏంటీ అనేది ఏ ఒక్కరు క్లారిటీగా చెప్పక పోవడంతో ఆయన అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ సోషల్ మీడియా లో ధర్మేష్ పర్మార్ మృతిని కన్ఫర్మ్ చేస్తూ పోస్ట్ పెట్టాడు.
రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ గల్లీ బాయ్ సినిమా కోసం ఇండియా 91 ట్రాక్ కోసం ధర్మేష్ ర్యాప్ చేశాడు. ఎంసీ టాడ్ ఫాడ్ గా సోషల్ మీడియాలో బాగా పాపులారిటీని దక్కించుకున్న ధర్మేష్ మృతిని ఆయన అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.
అసలేం అయ్యింది అంటూ మీడియా ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సౌత్ ఇండియాకు చెందిన వారు ఇప్పుడు ధర్మేష్ పర్మార్ గురించి గూగుల్ చేస్తూ తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
ధర్మేష్ స్వదేశీ బ్యాండ్ పేరుతో గత రాత్రి సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియో లో చాలా ఉత్సాహంగా కనిపించిన ధర్మేష్ కు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నట్లుగా కూడా కనిపించడం లేదు.
అయినా కూడా ఎందుకు ఇంత హఠాత్తుగా మృతి చెందాడో అర్థం కావడం లేదు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇతడి మృతి పట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు మరియు అభిమానులు తీవ్ర దిగ్ర్బాంతిని వ్యక్తం చేస్తూ.. తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.