రాహుల్ గాంధీ పాదయాత్రలో హీరోయిన్లు సందడి చేస్తున్నారు. అది కూడా నిజాలు నిక్కచ్చిగా ప్రశ్నించే వివాదాస్పద హీరోయిన్లు. మొన్న పూనమ్ కౌర్ రాహుల్ చేతిలో చేయివేసి నడవగా.. ఈరోజు వివాదాస్పద బాలీవుడ్ ప్రముఖ నటి స్వరభాస్కర్ కూడా రాహుల్ జోడో యాత్రలో పాల్గొని సందడి చేశారు. అయితే ఈసారి చేతిలో చేయి వేయకుండా రాహుల్ జాగ్రత్తపడ్డారు. వెనుకాల చేయిపెట్టుకొని హీరోయిన్ స్వరభాస్కర్ తో కలిసి నడిచారు.
గురువారం బాలవుడ్ ప్రముఖ నటి స్వరభాస్కర్ భారత్ జోడోయాత్రలో పాల్గొన్నారు. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వెంట సినీ నటి స్వరభాస్కర్ భారత్ జోడోయాత్రలో నడిచారు. రాహుల్ గాంధీతో స్వరభాస్కర్ మాట్లాడుతూ నడిచారు.
ఈ జోడోయాత్ర 150 రోజుల్లో 12 రాష్ట్రాల్లో 3570 కిలోమీటర్లు నడిచేలా ప్రణాళిక రూపొందించారు. భారత్ ను ఏకం చేయాలనే లక్ష్యంతో సాగుతున్న ఈ యాత్ర 83వ రోజుకు చేరుకుంది. గురువారం ఉజ్జయినీ మీదుగా సాగుతోంది.
సెప్టెంబర్ 7వ తేదీన ప్రారంభమైన రాహుల్ గాంధీ పాదయాత్ర ఇప్పటివరకూ 7 రాష్ట్రాల్లోని 36 జిల్లాల మీదుగా సాగింది. మరో 1209 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది. .. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర 150 రోజుల పాటు కొనసాగనుంది. 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలితప్రాతాలను కవర్ చేయనుంది. 150 రోజుల పాటు 3570 కిలోమీటర్లు ఈ యాత్ర సాగనుంది. ప్రస్తుతం ఈ యాత్ర కేరళలో కొనసాగుతోంది.
దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ‘జోడో పాదయాత్ర’తో కాంగ్రెస్ లో జోష్ వచ్చింది. ఈ యాత్రలో రాహుల్ గాంధీ ఎంతో యాక్టివ్ గా ముందుకు సాగుతున్నారు. వెళ్లే మార్గంలో తమ కాంగ్రెస్ కార్యకర్తలను సంప్రదిస్తూ పార్టీని పటిష్టం చేస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలను మరింత లోతుగా ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా ఈ యాత్ర సాగుతుందని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.