అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులకు హెచ్ 1 బీ వీసా ఎంతో కీలకమైనది. అమెరికాలోని వివిధ కంపెనీలలో పనిచేసే విదేశీయుల కోసం ప్రతి ఏటా దాదాపు 65 వేల హెచ్ 1 బీ వీసాలను అమెరికా ప్రభుత్వం జారీ చేస్తుంది. ఈ వీసాలలో అత్యధికం భారతీయులే దక్కించుకుంటారు. అయితే, ఈ హెచ్ 1బీ వీసాలను పొందడంలో ఫారెన్ లేబర్ సర్టిఫికేషన్ కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఆ సర్టిఫికేషన్ క్లియర్ అయితేనే హెచ్ 1బీ వీసా లభిస్తుంది. ఆ జాబితాలోనూ భారతీయ టెక్ కంపెనీ ఒకటి టాప్ 10 లో చోటు దక్కించుకుంది. తాజాగా, 2018కు గాను ఫారెన్ లేబర్ సర్టిఫికేషన్ పొందడంలో భారత్ టెక్ దిగ్గజం టీసీఎస్ ముందంజలో ఉంది. ఈ ఏడాదికిగాను ఫారెన్ లేబర్ సర్టిఫికేషన్ పొందిన టాప్ -10 కంపెనీల జాబితాలో చోటుదక్కించుకున్న ఏకైక భారతీయ కంపెనీ టీసీఎస్ కావడం విశేషం.
ఈ ఏడాదికిగాను ఫారెన్ లేబర్ సర్టిఫికేషన్ పొందిన టాప్ -10 కంపెనీల జాబితాలో ఎర్నెస్ట్ అండ్ యంగ్ కంపెనీ ప్రథమ స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత రెండో స్థానంలో డెలాయిట్ కన్సల్టెంగ్ ఉంది. ఇక మూడో స్థానంలో కాగ్నిజెంట్ కొనసాగుతోంది. ఆ తర్వాత హెచ్ సీఎల్ - కే ఫోర్స్ - యాపిల్ - టీసీఎస్ - క్వాల్ కామ్ - ఎమ్ ఫసిస్ - క్యాప్ జెమిని...టాప్ -10లో చోటు దక్కించుకున్నాయి. సెప్టెంబరు 30వరకు ఉన్న గణాంకాలను డిపార్ట్ మెంట్ ఆఫ్ లేబర్ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. హెచ్ 1 బీ వీసా దరఖాస్తు చేయడానికి ముందు ప్రతి సంస్థ.....లేబర్ కండిషన్ అప్లికేషన్ ను డిపార్ట్ మెంట్ ఆఫ్ లేబర్ కు సమర్పించాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తులను డిపార్ట్ మెంట్ ఆఫ్ లేబర్ పరిశీలించి అనుమతి ఇచ్చిన తర్వాతే...సదరు కంపెనీలు తదుపరి ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుంది.