టీడీపీ లో నేతల మధ్య ఐక్యత తక్కువగానే ఉంది. ఎవరు కాదన్నా.. ఔనన్నా.. ఇది నిజం! ఈ విషయం పార్టీ అధినేత చంద్రబాబు కూడా తెలుసు. ఆయన కూడా ఈ విషయాన్ని తప్పు అని చెప్పడం లేదు. అలాగని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నా.. అనుకున్న విధంగా సక్సెస్ కాలేక పోతున్నారు.
తాజాగా అనంతపురం లో మంత్రి ఉష విషయాన్ని తీసుకుంటే.. ఇక్కడ ఆమెకు ఆహ్వానం పలుకుతూ.. చేసిన.. ర్యాలీ లో ఒక చిన్నారి చిక్కుకుపోయి.. వైద్యం అందక.. మృతి చెందింది. దీనికి సంబందించి జిల్లా నేతలను చంద్రబాబు ఉద్యమించాలని ఆదేశించారు. దీంతో కొందరు నాయకులు రోడ్డెక్కారు.
కళ్యాణదుర్గం నేతలు ర్యాలీలు.. నిరసనలు చేపట్టారు. ఇక, ఈ నియోజకవర్గం తో సంబంధం లేదని అనుకున్నారో.. లేక మేం పాల్గొంటే మాకేంటి లాభం అనుకున్నారో తెలియదు కానీ.. టీడీపీకి మైలేజీ ఇస్తుందని అనుకున్న ఈ కార్యక్రమానికి ఇతర నియోజకవర్గాల్లోని టీడీపీ నాయకులు దూరంగా ఉన్నారు.
దీంతో టీడీపీ నేతలు చేసిన ర్యాలీలు ఏకపక్షంగా సాగాయి. దీనికి తోడు వీరితో కలిసి బాధితులను కలవాల్సిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి ఒక్కరే వెళ్లి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. ఆయన సొంత డబ్బే ఇచ్చినా.. అది పార్టీ పరంగా ఇచ్చి ఉంటే.. బాగుండేదనే వాదన వినిపించింది.
కానీ, జేసీ మాత్రం తనే తన అనుచరులతో వెళ్లి స్వయంగా బాధితులను కలిసి రూ.50 వేలు ఇచ్చారు. ఇక, మిగిలిన నాయకులు, మాజీ మంత్రులు కనీసం ఈ విషయం పై ఒక్క ప్రకటన కూడా చేయలేదు. ఇలా.. ఈ ఒక్క జిల్లాలోనే కాదు.. పశ్చిమలోనూ ఇటీవల కనిపించింది.
ఇక్కడ నాటు సారా తాగి మృతి చెందిన వారి కుటుంబాలను టీడీపీ నేతలు పరామర్శించేందుకు వస్తే.. ఇక్కడ స్థానికంగా ఉ న్న కీలక నాయకుడు మాత్రం రాలేదు. ఆయన విషయం తెలిసి.. అదే రోజు హైదరాబాద్‌లో పని ఉందని వెళ్లిపోయారు. ఈ పరిణామాలు.. టీడీపీలో ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి.
ఇప్పటికి ఎన్నికలు పూర్తయి.. మూడేళ్లు గడిచిపోయాయి. అయినప్పటికీ.. నేతల మధ్య సఖ్యత లేదు. ఎవరికి వారు మైలేజీ కోరుకుంటున్నారు. ఎవరికివారు.. సీట్లు ఆశిస్తున్నారు. ఇలా చేస్తున్న వ్యక్తిగత రాజకీయాలు పార్టీకి కలిసి రాకపోతే.. సీనియర్ల ను పార్టీకి దూరం చేస్తోందనే వాదన వినిపిస్తోంది. పోనీ.. అధినేత.. మనసులో ఏముందో చెప్పే ప్రయత్నం కూడా చేయడం లేదని ఎక్కువ మంది అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో పూర్తిగా కొత్తవారికే ఇచ్చే ఆలోచన ఉంటే.. వారికే పూర్తి బాధ్యతలు అప్పగిస్తే మేలని.. లేదా.. సీనియర్లనుకూడా కలిసి రాజకీయాలు చేయలంటే.. వారికి తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయంలో చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.