టీడీపీ నేత కొల్లు ర‌వీంద్ర అరెస్టు.. లోకేష్ ఘాటు వ్యాఖ్య‌లు!

Update: 2021-07-11 11:43 GMT
మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో స‌భ్యుడు కొల్లు ర‌వీంద్ర‌ను పోలీసులు అరెస్టు చేశారు. మ‌చిలీప‌ట్నం చింత‌చెట్టు సెంట‌ర్లో మునిసిపల్ అధికారులు ఆక్ర‌మ‌ణ తొల‌గింపును ర‌వీంద్ర అడ్డుకున్నారు. టీడీపీ సానుభూతి ప‌రుల‌ను టార్గెట్ చేశారని, ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఈ దుకాణాలు తొల‌గిస్తున్నారంటూ ఆందోళ‌న‌కు దిగారు. టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి అక్క‌డే బైఠాయించారు.

దీంతో.. పోలీసులు వారిని ఖాళీ చేయించేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ.. వారు అక్క‌డి నుంచి క‌ద‌ల్లేదు. ఈ క్ర‌మంలో పోలీసుల‌తో కొల్లుర‌వీంద్ర‌, టీడీపీ నేత‌లు వాగ్వాదానికి దిగారు. ప‌రిస్థితి ఉద్రిక్తంగా మార‌డంతో పోలీసులు కొల్లు ర‌వీంద్ర‌ను అరెస్టు చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ప‌దిహేను సంవ‌త్స‌రాలుగా ఇక్క‌డే ఉంటున్న మైనారిటీల దుకాణాల‌ను కూల్చేస్తున్నార‌ని అన్నారు. మిగిలిన‌వి వ‌దిలి పెట్టి, మ‌ధ్య‌లో ఉన్న నిర్మాణాల‌ను మాత్ర‌మే కూల్చ‌డ‌మేంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఉన్న‌వారిని ల‌క్ష్యంగా చేసుకొని, టీడీపీ సానుభూతిప‌రులవి మాత్ర‌మే కూల్చేస్తున్నార‌ని ర‌వీంద్ర ఆరోపించారు.

కాగా.. ర‌వీంద్ర అరెస్టుపై టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ స్పందించారు. టీడీపీ పై అక్క‌సుతోనే కావాల‌ని త‌మ పార్టీ నేత‌ల‌ను అరెస్టు చేస్తున్నార‌ని లోకేష్ ఆరోపించారు. వైసీపీ నేత‌లు కొన‌సాగిస్తున్న బాక్సైట్ మైనింగ్ అక్ర‌మాల‌ను బ‌య‌ట పెట్టార‌నే కోపంతోనే.. టీడీపీ నేత‌ల‌ను అరెస్టు చేయిస్తున్నార‌ని జ‌గ‌న్ స‌ర్కారుపై మండిపడ్డారు లోకేష్‌.
Tags:    

Similar News