ఏపీలో కొత్తగా అధికారం చేపట్టిన వైసీపీలో ఇప్పుడు ఓ రకమైన కొత్త వాతావరణం నెలకొంటోంది. మొన్నటి ఎన్నికలకు ముందు పెద్ద సంఖ్యలో టీడీపీ, ఇతర పార్టీల నేతలు వైసీపీలోకి క్యూ కట్టారు. జనం కూడా వైసీపీకి బ్రహ్మరథం పట్టడంతో వైసీపీ అధినేత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే తనదైన శైలి పాలనను పరుగులు పెట్టిస్తున్న జగన్ వైఖరికి ఇతర పార్టీల నేతలు ఆకర్షితులు అవుతున్నారు. అంతేకాకుండా టీడీపీకి క్రమంగా భవిష్యత్తు ప్రశ్నార్థకమేనన్నే వాదనలో ఆ పార్టీకి చెందిన కీలక నేతలు వైసీపీలోకి క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే రాయలసీమ జిల్లాలకు చెందిన టీడీపీ కీలక నేత వైసీపీలోకి చేరిపోవడం ఖాయమైపోయింది. అయితే ఆ సీనియర్ ను పార్టీలోకి ఆహ్వానిస్తే మాత్రం తాను ఆత్మహత్య చేసుకుంటానని వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం ఇప్పుడు సంచలనంగా మారిపోయింది.
రాయలసీమ జిల్లాల్లో రాజకీయ నేతల మధ్య ఫ్యాక్షన్ కక్షలు చాలా కాలం నుంచే కొనసాగుతున్నాయి. ఏ రెండు పార్టీలకు చెందిన నేతల మధ్య కూడా సఖ్యత లేదన్న మాట కూడా కాదనలేనిదే. ఈ క్రమంలో ఓ వర్గం మరో వర్గంపై దాడులకు తెగబడటం, బాధిత వర్గం ప్రతిదాడులకు దిగడం అక్కడ పరిపాటిగానే మారిందని కూడా చెప్పాలి. ఈ తరహా గొడవల్లో ఆయా జిల్లాలకు చెందిన కీలక నేతలు కూడా ప్రాణాలు కోల్పోయిన వైనం కూడా మనకు తెలియనిదేమీ కాదు. ఈ తరహా గొడవల్లో తన కుటుంబ పెద్దను కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే... అందుకు కారణమైన టీడీపీ సీనియర్ ను పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారని ప్రశ్నిస్తున్నారట.
గడచిన ఎన్నికల్లోనూ తనను ఓడించడమే కాకుండా తమ ఫ్యామిలీని రాజకీయాల నుంచి సాగనంపడమే లక్ష్యంగా సాగిన సదరు టీడీపీ సీనియర్ కు ఎలా ఆహ్వానం పలుకుతారని సదరు వైసీపీ ఎమ్మెల్యే పార్టీ పెద్దల వద్దే వాపోతున్నారట. అయితే ఆమె వాదనను ఆలకిస్తున్నట్లుగానే కనిపిస్తున్న పార్టీ పెద్దలు... ఆ టీడీపీ సీనియర్ పార్టీలోకి వస్తే మరింత బలపడతామని, పార్టీకి మేలు జరుగుతుందని చెబుతున్నారట. ఈ క్రమంలో తన వాదనను పట్టించుకునే అవకాశం లేదని ఓ అంచనాకు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే తన అనుచరుల వద్ద గోడు వెళ్లబోసుకున్నారట. తన మాటను కాదని ఆ టీడీపీ సీనియర్ ను పార్టీలోకి ఆహ్వానిస్తే... తాను ఆత్మహత్య చేసుకుంటానని కూడా ఆ వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారట.