రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి.. టీడీపీ ఖాళీ అవుతోంది. ఇప్పటికే ఎంతోమంది వైఎస్సార్సీపీలో చేరగా తాజా చంద్రబాబుకు సన్నిహితుడిగా ఉన్న మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు శిద్దా రాఘవరావు కూడా రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరనున్నాడట. ఈ మేరకు వ్యవహారమంతా సిద్ధమైంది. ఎప్పటి నుంచో వైఎస్సార్‌సీపీ నేతలతో టచ్‌లో ఉన్న ఆయన తాజాగా సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోబోతున్నారనే వార్త హాట్ టాపిక్ గా మారింది.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శిద్దా రాఘవరావు మంత్రిగా పని చేశారు. చంద్రబాబు కు సన్నిహితంగా ఉంటారు. 2004లో టీడీపీ తరపున ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోగా అనంతరం 2014లో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ సమయం లో మంత్రిగా పని చేశారు. 2019 ఎన్నికల్లో ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఇప్పుడు రాజకీయాలు పూర్తిగా మారిపోవడం.. తెలుగుదేశానికి గడ్డు కాలం ఉండడంతో చివరకు ఆయన కూడా టీడీపీకి రాజీనామా చేయనున్నారంట. ఈ మేరకు సోమవారం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని శిద్దా రాఘవరావు కలిసి వైఎస్సార్సీపీ లో చేరనున్నారని ప్రచారం సాగుతోంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన చేరిక లాంఛనమేనని తెలుస్తోంది.