అధికారం చేతిలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్లు ఇసుక మాఫియాను ఎలా రన్ చేశారో అందరికీ తెలిసిందే. ఎక్కడిక్కడ స్థానిక నేతలు శాండ్ మాఫియాను నడిపించారు. ప్రతి ఊర్లోనూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కనుసన్నల్లోనే ఇసుక వ్యవహారాలు నడిచాయి. ఎక్కడిక్కడ శాండ్ మాఫియా అప్పుడు ఒక రేంజ్ లో వర్ధిల్లింది.
ఇసుకతోనే కోట్ల రూపాయలు కుప్పేసిన తెలుగుదేశం పార్టీ నేతలున్నారంటే ఆశ్చర్యం కలగకమానదు. ప్రత్యేకించి పక్క రాష్ట్రాలతో సరిహద్దును పంచుకునే జిల్లాల నేతలు అయితే భారీ ఎత్తున ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించి అమ్ముకున్నారు. ఒక్కో లారీ ఇసుకను లక్ష రూపాయల స్థాయిలో అమ్మిన దాఖలాలు ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
మరి కొందరు అయితే ఇసుకను భారీ ఎత్తున తమ స్థలాల్లోకి తోలుకున్నారని టాక్. అధికారం చేతిలో ఉన్నప్పుడు.. ఒకవైపు ఇసుకను అయిన కాడికి అమ్ముతూనే, వాగుల్లో ఉంటే వేరే వాళ్లు తోడుకుంటారేమో అనే లెక్కలతో మరి కొందరు భారీగా ఇసుక డంప్ లు ఏర్పాటు చేసుకున్నారని తెలుస్తోంది.
కొన్ని వందల లారీల ఇసుకను వారు తమకు అనువైన స్థలాల్లోకి తోలుకుని దాచుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్నే కొంతమంది ప్రస్తావిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పార్థ సారధి కూడా ప్రస్తావించారు. ఒక తెలుగుదేశం నేత కు సంబంధించిన స్థలం భారీగా ఇసుకను చేర్చుకున్నారని, దాన్ని అక్కడ నుంచి బ్లాక్ లో అమ్ముతున్నారని ఆయన అన్నారు.
కంకిపాడుకు చెందిన ఒక టీడీపీ ముఖ్య నాయకుడు పొలంలో పెద్ద ఎత్తున ఇసుకను దాచి పెట్టారని ఆయన అన్నారు. ఒకవైపు తెలుగుదేశం నేతలు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటూ కూడా మళ్లీ ఇసుక విషయంలో మాట్లాడుతుండటం విడ్డూరమని పరిశీలకులు అంటున్నారు.