టీడీపీది నిరసనా.. బీజేపీకి ప్రచారమా?

Update: 2016-08-04 13:30 GMT
ప్రత్యేక హోదాపై సగం మొహమాటంతో పోరాటం చేస్తున్న టీడీపీ తమ నిరసన తెలిపేందుకు విచిత్రమైన విధానాలను ఎంచుకుంటోంది. కేంద్రంలోని బీజేపీ దుమ్ము దులిపేసి... సెంట్రల్ గవర్నమెంటు నుండి  బయటకురావడం మానేసి రోడ్లు ఊడవడాలు - పార్లమెంటు ముందు ప్లకార్డులు పట్టుకోవడాలు వంటి ఉప్పు సత్యాగ్రహాలు చేస్తోంది. తాజాగా ప్రత్యేక హోదా పోరాటం పేరుతో తాజాగా టీడీపీ చేసిన ఆందోళన విమర్శల పాలవుతోంది.  గురువారం ఏపీలోపి టీడీసీ నాయకులు రోడ్లు ఊడ్చుతూ వినూత్నంగా నిరసన తెలిపారు.  అయితే.. చీపుర్లు పట్టుకుని వారు రోడ్లు ఊడ్చుతుంటే అంతా మోడీ కలల కార్యక్రమం స్వచ్ఛభారత్ ప్రచారం అనుకుంటున్నారే కానీ ప్రత్యేక హోదా కోసం టీడీపీ నిరసన తెలుపుతోందని మాత్రం అనుకోవడం లేదట.
    
ప్రత్యేక హోదా అంశాన్ని కాంగ్రెస్ - వైసీపీ దీన్ని తమ రాజకీయ పోరాటంగా మలచుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీ కూడా టేకప్ చేయాల్సి వచ్చింది. దీంతో ఆ పార్టీ చేస్తున్న ఉద్యమాలు ప్రభావవంతంగా ఉండడం లేదు. పైగా నిరసన పేరుతో బీజేపీ కార్యక్రమాలకు ప్రచారం చేస్తున్నట్లుగా ఉంది.
    
ఈ స్వచ్చభారత్ స్టైలు నిరసన సందర్భంగా టీడీపీ నేత ముద్దు కృష్ణమనాయుడు మాట్లాడుతూ ధర్నాలు - నిరసనలతో హోదా సాధనకోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు వివిధ రూపాల్లో ఢిల్లీ వరకు ఆందోళన కొనసాగిస్తామని అన్నారు. కానీ.. జనమే టీడీపీ నేతలది నిరసన అనుకోవడం లేదు. స్వచ్ఛభారత్ ప్రచారమో లేదంటే ఇంకుడు గుంతలు - వనం మనం లాగా ఇది కూడా కొత్త కార్యక్రమమేమో అనుకుంటున్నారట. సోషల్ మీడియాలోనూ దీనిపై సెటైర్లు ఒక రేంజిలో పడుతున్నాయి. రోడ్లు ఊడిస్తే ప్రత్యేక హోదా వచ్చేస్తుందా అని ప్రశ్నిస్తున్నారు.
Tags:    

Similar News