లేడీ మినిస్ట‌ర్‌ను ఓడించ‌డం ఎలా... టీడీపీకి ఒక్క‌టే టెన్ష‌న్ ?

Update: 2021-08-31 03:30 GMT
రాష్ట్రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీకి కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాలు.. తీవ్ర‌మైన ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయి. అక్క‌డ నాయ‌కులు బాగానే ఉన్న‌ట్టుగా ఉంటారు. కానీ, స‌మ‌యానికి మాత్రం అంతు చిక్క డం లేదు. దీంతో పార్టీ ప‌రిస్థితి ఇబ్బందిగా మారింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితే.. గుంటూరు జిల్లా  ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గంలో చోటు చేసుకుంది. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి రిజ‌ర్వ్ అయిన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఒక‌ప్పుడు టీడీపీ ప్ర‌భంజ‌నం సాగింది. మాకినేని పెద‌ర‌త్త‌య్య‌.. వ‌రుస విజ‌యాల‌తో పార్టీని ముందుకు తీసుకువెళ్లారు.

త‌ర్వాత‌.. ఈ నియోజ‌క‌వ‌ర్గం ఎస్సీల‌కు రిజ‌ర్వ్ చేసిన త‌ర్వాత‌.. నుంచి టీడీపీ నుంచి పోటీ చేసే నాయ‌కుల ను వెతుక్కునే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇక‌, కాంగ్రెస్ త‌ర‌ఫున గ‌తంలో రంగంలోకి దిగిన ప్ర‌స్తుత హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత‌.. 2009లో విజ‌యం ద‌క్కించుకున్నారు. ఆ త‌ర్వాత‌..ఆమె వైసీపీలోకి చేరిపోయారు. 2014లో ఓట‌మి చెందినా.. మ‌ళ్లీ అనూహ్యంగా పుంజుకున్నారు. 2019లో మ‌రోసారి వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక్క‌డ సుచ‌రిత హ‌వా బాగానే సాగుతోంది. అంద‌రికీ అందుబాటులో ఉంటున్నారు. అభివృద్ధి విష‌యంలోనూ దూకుడుగా ముందుకు సాగుతున్నారు.

ఈ క్ర‌మంలో ఇప్పుడు ఇక్క‌డ‌.. మంత్రి సుచ‌రిత‌ను ఓడించి.. టీడీపీ పాగా ఎలా వేయాల‌నే విష‌యంపై ఇటీవ‌ల చ‌ర్చ‌కు వ‌చ్చింది. 2014 ఎన్నిక‌ల్లో అనూహ్యంగా తెర‌మీదికి వ‌చ్చిన మాజీ ఐఆర్ఎస్ అధికారి.. రావెల కిశోర్‌బాబుకు చంద్ర‌బాబు టికెట్ ఇచ్చారు. ఆయ‌న గెలిచారు కూడా. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి కూడా ఇచ్చారు. కానీ, త‌ర్వాత వివాదం కావ‌డంతో రావెల‌ను త‌ప్పించారు. దీంతో ఆయ‌న ఎన్నిక‌ల‌కు ముందు పార్టీని వీడిపోయారు. దీంతో ఇప్పుడు.. ఇక్క‌డ నుంచి పోటీ చేసేందుకు టీడీపీ ఎస్సీ నాయ‌కుల కొరత స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

ఇదే విష‌యంపై చంద్ర‌బాబు తాజాగా జ‌రిపిన చ‌ర్చ‌లో ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్‌గా ఉన్న మాకినే ని పెద‌ర‌త్త‌య్య ఇష్టానికే వ‌దిలేయాల‌ని.. ఇక్క‌డ పార్టీని గెలిపించే బాధ్య‌త‌ల‌ను ఆయ‌న చేతుల్లోనే పెట్టా లని నిర్ణ‌యించారు. అంటే.. మాకినేనికి ఎలాగూ పోటీ చేసే అవ‌కాశం లేనందున‌.. ఆయ‌న చూపించిన వారికి టికెట్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. మ‌రి ఇది ఎంత‌వ‌ర‌కు వ‌ర్కవుట్ అవుతుందో చూడాలి. సుచ‌రిత వంటి బ‌ల‌మైన నాయ‌కురాలిపై ఎవ‌రు పోటీకి దిగుతారో అనేది ఆస‌క్తిగా మారింది.
Tags:    

Similar News