నియోజకవర్గాల అభివృద్ధి కోసం కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. 10మంది వస్తారా లేక 12మంది వస్తారా అన్న సంఖ్య ఇప్పుడే చెప్పలేమని ఆయన చెప్పుకొచ్చారు.
సీఎం జగన్, వైసీపీ ముఖ్యనాయకులతో టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం బాంబు పేల్చారు. ప్రకాశం జిల్లా నుంచి కూడా పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి చేరుతున్నారన్న సమాచారం ఉందన్నారు. దీనికి కొంత సమయం పడుతుందని వివరించారు.
చంద్రబాబుతో తాము చాలా కాలం ప్రయాణించామని.. ఎంత ఇబ్బంది పడ్డామో తెలుసు అంటూ టీడీపీ అధినేతపై కరణం బలరాం నిప్పులు చెరిగారు. సమయం వచ్చినప్పుడు చంద్రబాబుపై మాట్లాడతానని ఆయన తెలిపారు. చంద్రబాబు పోకడకి.. జగన్ వ్యవహారశైలికి చాలా తేడా ఉందని.. నమ్ముకున్న వాళ్లకి సీఎం జగన్ న్యాయం చేస్తారని ప్రశంసించారు. వైఎస్ఆర్ తో కూడా తనకు సన్నిహిత సంబంధాలున్నాయని ఆయన గుర్తు చేశారు.
వెలిగొండ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు నిర్లక్ష్యం చేశారని.. టీడీపీ ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి తెచ్చినా పూర్తి చేయలేదని కరణం బలరాం తాజాగా ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఎక్కువగా వస్తే చంద్రబాబు కు ప్రతిపక్ష హోదా పోతుందనే మమ్మల్ని రమ్మనలేదని కరణం సంచలన వ్యాఖ్యలు చేశారు.