తుపాకీ చెప్పిన మాట అక్షరాల నిజమైంది. టీడీపీకి ఆ పార్టీ సీనియర్ నేత, విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) రాజీనామా చేశారు. అంతేకాకుండా నేటి సాయంత్రం ఆయన హైదరాబాద్ కు చేరుకుని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి రాజీనామా చేయడంతో పాటు నిన్న ఉదయం లోటస్ పాండ్ లో జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. త్వరలోనే తాను వైసీపీలో చేరుతున్నానని ప్రకటించిన ఆయన... నైతికంగా వైసీపీలో చేరిపోయినట్టేనని తేల్చేశారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది.
జగన్ తో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆమంచి... తనతో పాటు చాలా మంది టీడీపీ ప్రజాప్రతినిధులు వైసీపీలో చేరబోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వార్తలు వెలువడిన కాసేటికే టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు అవంతి సిద్ధమైపోయారు. దీనిపై *తుపాకీ* ఎక్స్ క్లూజివ్ కథనాన్ని ప్రచురించింది. టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్న అవంతి త్వరలోనే వైసీపీలో చేరబోతున్నారంటూ ఆ కథనంపే పేర్కొంది. తుపాకీ కథనం నిజమేనన్నట్లుగా నేటి ఉదయం అవంతి టీడీపీకి రాజీనామా చేసేశారు. అంతేకాకుండా ఇప్పటికే జగన్ తో ఆయన ఫోన్ లో సంప్రదించినట్లుగా, త్వరలో వచ్చి కలుస్తానని కూడా అవంతి చెప్పారట. ఈ విషయం నిజమేనన్నట్లుగా విశాఖ జిల్లాకు చెందిన వైసీపీ నేతలు ఉన్నపళంగా హైదరాబదాదు రావాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు.
పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న అవంతి శ్రీనివాస్ కు ఏ మేర ప్రాధాన్యం కల్పించవచ్చన్న విషయాన్ని తేల్చేందుకే జగన్ విశాఖ జిల్లా నేతలకు రమ్మనట్టుగా సమాచారం. ఇదిలా ఉంటే... టీడీపీకి రాజీనామా చేసేసిన అవంతి... ఈ రోజు సాయంత్రం గానీ, రేపు ఉదయం గానీ హైదరాబాదుకు రానున్న అవంతి... జగన్ తో భేటీ కానున్నారు. ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరడం దాదాపుగా ఖాయమన్న వాదన వినిపిస్తోంది. అధికార పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికే రాజీనామాలు చేసి వైసీపీలో చేరగా... ఇప్పుడు ఏకంగా ఓ ఎంపీ కూడా అదే బాటలో నడుస్తుండటం సంచలనంగా మారిపోయిందని చెప్పాలి.