ఆ ఆరు జిల్లాల్లో తెలుగుదేశం నెగ్గేది కేవలం ఎనిమిది సీట్లేనా!

Update: 2019-04-29 16:30 GMT
ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గట్టి దెబ్బ తీసేది గ్రేటర్ రాయలసీమ ప్రాంతమే అనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నెగ్గినప్పుడే గ్రేటర్ రాయలసీమ పరిధిలోని ఆరు జిల్లాల పరిధిలో ఆ పార్టీకి వచ్చిన సీట్లు అంతంత మాత్రం.

అనంతపురం జిల్లాలో మినహాయిస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎక్కడా తగిన స్థాయిలో సీట్లను సంపాదించుకోలేకపోయింది. అయితే అప్పుడు తెలుగుదేశం పార్టీకి గ్రేటర్ రాయలసీమ పరిధిలో కొద్దో గొప్పో సీట్లు రావడానికి  కొన్ని కారణాలున్నాయి. రుణమాఫీ వంటి హామీ అప్పుడు తెలుగుదేశం పార్టీని అక్కడ కాపాడింది. రైతుల కుటుంబాలు అప్పుడు ఓట్లు వేయడంతో తెలుగుదేశం కొన్ని సీట్లను అయినా నెగ్గింది.

అయితే ఈ సారి మాత్రం తెలుగుదేశం పార్టీకి ఆ ఛాన్స్ లేదని స్పష్టం అవుతోంది. అప్పుడు ఇచ్చిన హామీల అమలులో చంద్రబాబు నాయుడు విఫలం కావడం - రైతు రుణమాఫీ - డ్వాక్రా రుణమాఫీ వంటి వాటికి ఎగనామం పెట్టడం వంటి కారణాలతో ఈ సారి తెలుగుదేశం పార్టీకి అక్కడ గట్టి ఎదరుదెబ్బ తగలబోతోందని సమాచారం. ఎంతలా అంటే.. మొత్తం ఆరు జిల్లాల పరిధిలో తెలుగుదేశం పార్టీకి దక్కేది కేవలం ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు మాత్రమే అనే టాక్ మొదలైందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ప్రకాశం - నెల్లూరు - చిత్తూరు - కడప - కర్నూలు - అనంతపురం జిల్లాల పరిధిలో తెలుగుదేశం పార్టీ కేవలం ఎనిమిది సీట్లలో మాత్రమే నెగ్గే అవకాశాలున్నాయని.. అది కూడా అనంతపురంలో మూడు - చిత్తూరులో రెండు - నెల్లూరులో ఒకటి - ప్రకాశం జిల్లాలో రెండు ఎమ్మెల్యే సీట్లను మాత్రమే నెగ్గవచ్చనే  అభిప్రాయాలు  వినిఇస్తున్నాయి. ఒక  వార్తా చానల్సర్వేలో కూడా ఈ విషయమే  తేలిందని సమాచారం. దాని అంతర్గత నివేదికలే ఈ అంశం బయటపడటంతో… ఈ అంశం మీద చర్చ జరుగుతూ ఉంది.
Tags:    

Similar News