తెలంగాణ బిజెపి నేత దారుణ హత్య...!

Update: 2020-12-26 05:40 GMT
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో దారుణమైన హత్య జరిగింది. ఖమ్మం జిల్లాలోని వైరా మండల కేంద్రంలో  బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకుడు నేలవెల్లి రామారావు దారుణ హత్యకు గురైయ్యారు. బీజేపీ నేత నేలవెల్లి రామారావుపై  కొందరు గుర్తు తెలియని వ్యక్తులు శనివారం తెల్లవారుజామున కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆయనను చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన శనివారం మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు దాడి ఘటనపై విచారణ చేపట్టారు. అయితే, ఆర్టీఐ ద్వారా రామారావు ఉద్యమం చేస్తుంటారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే  రామారావుపై దాడికి కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కాగా దాడికి పాల్పడిన నిందితుడు మాడపాటి రాజేష్‌ ఈ రోజు  ఉదయం మధిర కోర్టులో లొంగిపోయాడు.  ఈ ఘటనగురించి  గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Tags:    

Similar News