ఇటు బాబుతో.. అటు షర్మిలతో.. తెలంగాణలో బీజేపీ నయా స్కెచ్

Update: 2023-01-14 05:30 GMT
ఎలాగైనా సరే తెలంగాణలో అధికారం సంపాదించాలని బీజేపీ స్కెచ్ గీస్తోంది. తమ చేతికి మట్టి అంటకుండా కేసీఆర్ ను కూలదోయాలని చూస్తోంది. ఇప్పటికే బీజేపీ ఏజెంట్లను పంపి కొనుగోలు యత్నాలు బెడిసికొట్టడంతో రాజకీయంగా దెబ్బకొట్టాలని చూస్తోంది. ఈ క్రమంలోనే ఏపీకి పరిమితమైన చంద్రబాబు మళ్లీ వచ్చి ఖమ్మంలో సభ పెట్టడం.. ఢిల్లీ వెళ్లి షర్మిల అమిత్ షాతో భేటి కావడం.. ఇలా పలు రకాల పరిణామాలు తెరవెనుక జరుగుతున్నాయి. తెలంగాణలో బీజేపీ నయా స్కెచ్ గీస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రత్యక్షంగానైనా.. పరోక్షంగానైనా తెలంగాణలో బీజేపీకి సహాయ సహకారాలు అందించేందుకు బీజేపీ, జనసేన రెడీగా ఉన్నాయి. ఈ మూడు పార్టీలు   బీజేపీని తెలంగాణలో గెలిపించేందుకు కలిసి సాగాలని ప్లాన్ చేసినట్టు సమాచారం.ఇప్పటికే ఏపీలో టీడీపీ+జనసేన పొత్తు ఖాయమన్న సూచనలు కనిపిస్తున్నాయి. అయితే బీజేపీని కూడా ఇందులో కలుపుకుపోవాలని పవన్ భావిస్తున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదంటే ఇది తప్ప మార్గం లేదని భావిస్తున్నారు. అందుకే ముందుగా జరిగే తెలంగాణ అసెంబ్లీ ఈ ఎన్నికల్లో ఈ ముగ్గురు కూటమి కలిసి సాగాలా? లేక విడివిడిగానే అవగాహనతో ముందుకెళ్లాలా? అని ఆలోచిస్తోంది.

జ‌న‌సేన‌,టీడీపీ, బీజేపీ త్ర‌యం తెలంగాణ‌లో ఎన్నిక‌ల‌కు వెళ్తే విజ‌యావ‌కాశాలు మెండుగా ఉంటాయ‌నేది బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారని సమాచారం. తరుణ్ చుగ్ కూడా ఇదే మాట అన్నాడు. బలం లేని చోట టీడీపీని ప్రయోగిస్తే తమకు లాభిస్తుందని ఆయన ఆలోచిస్తున్నారట.. హైద‌రాబాద్ న‌గ‌రం, ఖ‌మ్మం, న‌ల్గొండ‌లోని టీడీపీ ఓటు బ్యాంకుతో పాటు, ప‌వ‌న్ ఇమేజ్ క‌లిసొస్తుంద‌ని బీజేపీ నేత‌లు భావిస్తున్నారు. తెలంగాణ‌లో పున‌ర్వైభ‌వం కోసం ప‌నిచేస్తున్న టీడీపీ కూడా ఈ అవ‌కాశాన్ని వ‌దులుకోకూడ‌ద‌ని భావిస్తోంది.  అయితే టీడీపీతో కలిస్తే గత సారి కాంగ్రెస్ ను దెబ్బతీసినట్టే బీజేపీని కేసీఆర్ చావుదెబ్బతీస్తారు. ఆ భయం ఉంది కాబట్టే తెలంగాణ బీజేపీ నేతలు.. అసలు చంద్రబాబుతో పొత్తు వద్దు అంటున్నారు.

అయితే పొత్తు లేకుండా విడివిడిగా పోటీచేసి ఎన్నికలయ్యాక సీట్లు తగ్గితే బీజేపీకి మద్దతు ఇచ్చేలా చంద్రబాబును ఒప్పించాలని చూస్తున్నారు. చంద్రబాబు కూడా తనకు ఏపీలో అధికారం కోసం తెలంగాణలో బీజేపీకి సహకరించడానికి అన్ని విధాలా రెడీ అయ్యారు. ఇప్పటికే ఖమ్మం సహా సభలు నిర్వహించి టీడీపీని లేపడానికి పూనుకున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈ మూడు పార్టీలు కలిసి సాగాలని ఓ అంచనాకు వచ్చినట్టు సమాచారం. ప్రధానంగా బీజేపీకి దక్షిణ తెలంగాణతోపాటు ఖమ్మం జిల్లాలో పెద్దగా బలం లేదు. అభ్యర్థులు లేరు. ఆశ్చర్యకరంగా ఇక్కడ కనుమరుగైన టీడీపీ బాగా బలం ఉంది. అందుకే  ఇటీవ‌ల తెలంగాణ బీజేపీ ఇన్చార్జీ త‌రుణ్ చుగ్ వ్యాఖ్య‌లు అందుకు బ‌లం చేకూర్చుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News