తెలంగాణ ప్రభుత్వం ఈసారి ఎన్నికల ముందర ఏకంగా 3 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టనుందని బీఆర్ఎస్ మీడియా కోడై కూస్తోంది. తెలంగాణ వచ్చాక ఇదే అత్యధికం కావడం గమనార్హం. మూడు లక్షల కోట్ల కేటాయింపులు వివిధ పథకాలకు చేస్తే సరిపోదు.. ఆ మొత్తం ఎక్కడి నుంచి తీసుకొస్తారో కూడా పద్దుల్లోనే చూపించాల్సి ఉంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో నిధుల సమీకరణ ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి.
కేంద్రం నుంచి వస్తాయనుకున్న గ్రాంట్లు, నిధులు రాలేదు. చివరకు అప్పులపై కూడా పరిమితి విధించారు. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిధుల సమీకరణ అనేది తెలంగాణ ప్రభుత్వానికి సవాల్ గా మారనుంది. కేంద్రం నుంచి పన్నుల వాటా, గ్రాంట్ల రూపంలో కొండంత వస్తాయని ఊహించుకోవడం.. తర్వాత ఊసురుమనడం రివాజుగా మారింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేంద్రం నుంచి 59వేల కోట్లు వస్తాయని వేసుకుంటే నికరంగా వచ్చేది 24వేలే కోట్లే. వచ్చే ఏడాది కూడా మహా అయితే మరో రెండు, మూడు వేల కోట్లు పెరుగాయేమో కానీ భారీగా పెరగవు.
మరోవైపు అప్పులపై పరిమితి తెలంగాణ ప్రభుత్వానికి గుదిబండగా మారింది. బడ్జెట్ లో ఎంత మేరకు అప్పులను లక్ష్యంగా పెట్టుకున్నా.. వాటి లక్ష్యం మేర బహిరంగ మార్కెట్ రుణాలను సాధించుకోవడం అంత తేలిక కాదు. తెలంగాణప్రభుత్వ ఆదాయం పెంపునకు రకరకాల మార్గాలను అన్వేషించినట్లుగా తెలుస్తోంది.
ఇసుక వంటి వాటి రేట్ల పెంపుతోపాటు హైదరాబాద్ శివార్లలో భూములను వేలం వేసి ప్రభుత్వం పెద్దఎత్తున నిధుల సమీకరించుకుంది. ఈసారి జిల్లాల్లో కూడా భూములు వేలం వేయాలన్న ఆలోచన చేస్తోంది. పలు శాఖల్లో పేరుకుపోయిన బకాయిలు, వన్ టైం సెటిల్ మెంట్లకు ఉన్న అవకాశాలు, కేంద్రం వద్ద ఉన్న బకాయిలను వసూలు చేసుకునే అవకావాలతో బడ్జెట్ లో అంచనాలను ప్రతిపాదించినున్నట్లుగా తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.