తెలంగాణ అధికారపక్షానికి చెందిన ముఖ్యనేతల మధ్య మాటల్లో గ్యాప్ పెరుగుతోంది.మొన్నటికి మొన్న కేంద్రమంత్రి వెంకయ్యను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె..ఎంపీ కవిత విమర్శలు ఎక్కు పెడితే.. ఆ పక్క రోజే ఆమె సోదరుడు.. రాష్ట్ర మంత్రి కేటీఆర్ వెంకయ్యను కలిసి రాష్ట్రానికి సాయం అందించాలని విన్నవించారు. ఒకవైపు తిట్టటం.. మరోవైపు సాయం అడగటం లాంటివి వైరుధ్యాలు కనిపించిన వైనాన్ని మర్చిపోకముందే మరో ఉదంతం చోటు చేసుకుంది.
ఈసారి ముఖ్యమంత్రి కేసీఆర్ కు.. ఆయన కుమారుడు కేటీఆర్ కు మధ్య మాటల్లో తేడా రావటం స్పష్టంగా కనిపిస్తోంది.ఇటీవల కురిసిన వర్షాలతో రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందంటూ ఆ మధ్యన కేసీఆర్ తరచూ వ్యాఖ్యానించటం.. రెండు పంటలు కాదు.. మూడు పంటలు వేసుకుందామన్న మాటలు కూడా కేసీఆర్ నోటి నుంచి వినిపిస్తున్న పరిస్థితి.
ఇదిలా ఉంటే.. మంత్రి కేటీఆర్ మాటలు మాత్రం మరోలా ఉన్నాయి. తాజాగా కురిసిన వర్షాలపై ఆయన ఆవేదనలో ఉన్నారు. తన మనసులో అభిప్రాయాన్ని వెల్లడించిన ఆయన.. ‘‘సరిగ్గా రెండు నెలల క్రితం మనం నీటి కొరతపై ఆందోళన చెందాం. నీటి పొదుపు అవశ్యకతపై దృష్టి సారించాం. ఆశ్చర్యకరంగా ఇప్పుడు నీట మునిగిన ప్రాంతాలపై దిగులు చెందుతున్నాం’’ అంటూ వ్యాఖ్యానించారు.
ఓవైపు వర్షాల కారణంగా పండుగ వాతావరణం నెలకొందని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాటకు భిన్నంగా.. ఇటీవల కురిసిన వర్షాలు దిగులు కలిగిస్తున్నాయన్న కేటీఆర్ మాట విన్నప్పుడు.. ఇటీవల వర్షాలపై కేసీఆర్ అండ్ కో హ్యాపీగా ఉందా? బాధగా ఉందా? అన్న అంశంపై కాస్త కన్ఫ్యూషన్ నెలకొని ఉందనటంలో సందేహం లేదు.