అసలు కంటే కూడా కొసరు కొన్నిసార్లు ప్రత్యేకంగా ఫోకస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి సీనే ఒకటి టీఆర్ఎస్ లో కనిపిస్తోంది. దసరా రోజున తన జాతీయ పార్టీకి సంబంధించిన కీలక ప్రకటన చేసేందుకు భారీ ఎత్తున ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు. ఇప్పటికే పూర్తి చేసిన ఏర్పాట్లకు అదనంగా మరికొన్ని కొత్తగా చేరుతున్నాయి.
ఈ కార్యక్రమం సైజు పెరుగుతున్న కొద్దీ.. గులాబీ బాస్ కేసీఆర్ కు తిట్ట హోరు కూడా ఎక్కువ అవుతుందని చెబుతున్నారు. అది కూడా బయట వారు కాదు.. సొంత వారే కావటం ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇస్పెషల్ గా చెబుతున్నారు. జాతీయ పార్టీ పెట్టటం తప్పేం కాదు కానీ.. అందుకు ఎంచుకున్న ముహుర్తం ఏ మాత్రం సరికాదంటున్నారు. కేసీఆర్ కల తీర్చటం కోసం.. ఆయన చుట్టూ ఉన్న వారంతా పండుగ అన్నది లేకుండా చేయటం ఎంతవరకు సబబు? అని ప్రశ్నిస్తున్నారు.
దసరా రోజున తాను పెట్టాలనుకుంటున్న జాతీయ పార్టీ ప్రకటనను చేస్తున్న కేసీఆర్.. దాని ప్రచారం కోసం ఇప్పటికే టీఆర్ఎస్ కు చెందిన సొంత మీడియా ఉద్యోగులను భారీగా వాడేస్తున్నట్లుగా చెబుతున్నారు. చాలా అరుదైన సందర్భాల్లో తప్పించి చేయని ప్రకటనను తాజా ఎపిసోడ్ లో చేస్తున్నట్లుగా సమాచారం. దసరా రోజున టీఆర్ఎస్ కు చెందిన సొంత మీడియా సంస్థల్లో పని చేసే ఏ ఉద్యోగికి సెలవు లేదన్న విషయాన్ని స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు.
అంతేకాదు.. రోటీన్ కు భిన్నంగా రెండు.. మూడు గంటలు అదనంగా పని చేయాలన్న ఆదేశాల్ని ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో.. ఉద్యోగులంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణ వరకు చూస్తే.. అతి పెద్ద పండుగైన దసరా రోజున పార్టీ ప్రకటన చేయటం ద్వారా.. కేసీఆర్ తమ కుటుంబాల ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. ఎంత జీతానికి పని చేస్తున్నా.. మరీ ఇంతలా వేధింపులకు గురి చేయటమా? అని తిట్టిపోస్తున్నారు.
జాతీయ పార్టీ పెట్టొద్దని చెప్పట్లేదు.. దానికి దసరానే ముహుర్తంగా ఫిక్సు చేయాలా? అని ప్రశ్నిస్తున్న వారు.. 'నిజంగానే ఆ రోజున ప్రకటన చేయాలంటే చేస్తే సరిపోతుంది. దాని కోసం మా ప్రాణాలు తీయటం ఎందుకు. అదేదో నెల ముందే చెప్పేస్తే సరిపోయేది. సరిగ్గా వారం ముందు చెప్పేసి.. అందర్ని ఆఫీసులకు రావాలని అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటికే దసరాకు ఎక్కడకు వెళ్లాలి? ఎవరెవరిని పిలవాలో ఇంట్లో నిర్ణయించుకున్నారు. ఇప్పుడు వారిని సముదాయించటం తలకు మించిన భారంగా మారింది. ఇదెక్కడి గోల?'' అంటూ మండిపడుతున్నారు.
కేసీఆర్ కు చెందిన సొంత మీడియా సంస్థల్లోని ఉద్యోగుల ఆగ్రహం ఇలా ఉంటే.. ఇప్పుడు వారికి పార్టీ నేతలు సైతం తోడయ్యారు. పెద్ద పండుగ వేళ.. ఎవరి ప్లాన్లు వారికి ఉంటాయని.. అందుకుభిన్నంగా తాను పెట్టే జాతీయ పార్టీ ప్రకటనకు ముందు పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. దీనికి సంబంధించిన ఇన్విటేషన్ తాజాగా పార్టీ నేతలకు వెళ్లింది. తాను పిలిచినా రాని వారి విషయాన్ని గుర్తించే అలవాటున్న కేసీఆర్ తీరుతో.. తాను తప్పక వెళ్లాల్సి ఉంటుందన్న విషయాన్ని గులాబీ నేతలు చెబుతున్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ ఏమో కానీ.. తమ చావుకు వచ్చినట్లుగా వాపోతున్నారు. సుబ్బి పెళ్లి ఎంకి చావుకొచ్చిన చందంగా.. కేసీఆర్ జాతీయ పార్టీ కారణంగా తామంతా దసరా పండుగను మిస్ అవుతున్నామని వాపోతున్నారు.