8 రాష్ట్రాలు జనరల్ కాన్సెంట్ ను ఉప సంహరించుకున్నాయి!

Update: 2022-10-30 13:30 GMT
తెలంగాణ ప్రభుత్వం.. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి జనరల్ కాన్సెంట్ ఉప సంహరించుకోవడం సంచలనంగా మారింది. వాస్తవానికి ఈ నిర్ణయం ఆగస్టు చివర్లోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల ద్వారా స్పష్టమవుతోంది. వాస్తవానికి సీబీఐకి జనరల్ కాన్సెంట్ ఉప సంహరణ సంచలనమైనదే. కానీ, పూర్తిస్థాయిలో చూస్తే దీని ప్రభావం పెద్దగా ఉండదని చెబుతుంటారు. ఏమైతేనేం..? తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో రాజకీయాలు వేడెక్కిన వేళ ఈ ఉత్తర్వు బయటకు రావడం మరింత వేడెక్కిస్తోంది.

అప్పట్లో బాబు.. మమతా

2014 ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ హవా సాగుతున్న సమయంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని విభజిత ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆనక అనేక అంశాలతో వారితో విభేదించి కేంద్రంలోని పాలక కూటమి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. 2018 బడ్జెట్ తర్వాత విభేదాలు మరింత ముదిరి టీడీపీ కేంద్ర మంత్రులు రాజీనామా కూడా చేశారు. ఇఖ 2019 ఎన్నికలకు కలిసి వెళ్లలేనంతగా రాద్ధాంతం జరిగింది.

ఈ క్రమంలో ఏపీలో చంద్రబాబు హయాంలో విపరీతమైన అవినీతి జరిగిందని అప్పటి ప్రతిపక్ష వైసీసీ రగడ చేసింది. ఏ క్షణంలో అయినా సీబీఐ రాష్ట్రంలోకి వస్తుందన్న ఊహాగానాలతో నాటి చంద్రబాబు సర్కారు 2018 ఆఖరు, 2019 ప్రారంభంలో సీబీఐకి జనరల్ కాన్సెంట్ ఉపసంహరించుకుంది. అవినీతి జరగబట్టే ఇలా చేశారంటూ వైసీపీ పెద్ద ఎత్తున హడావుడి చేసింది. ఇక పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ సైతం ఇలానే చేసింది. మమత అంటేనే నియంత కాబట్టి.. అక్కడ ప్రతిపక్షం బలంగా లేదు కాబట్టి ఇదేమంత విషయం కాలేదు. 2021 ఎన్నికల్లోనూ ఆమె విజయదుందుభి మోగించారు. అయితే, చంద్రబాబు 2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.

మొత్తం 8 రాష్ట్రాలు

సీబీఐకి 2015 నుంచి చూస్తే మొత్తం 8 రాష్ట్రాలు జనరల్ కాన్సెంట్ ను ఉప సంహరించుకున్నాయి. మొదట మిజోరం 2015లో ఈ పని చేసింది. బెంగాల్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర , రాజస్థాన్, మిజోరం ఈ జాబితాలో ఉన్నాయి. అయితే, వీటిలో మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన కూటమి అధికారంలో ఉండగా జనరల్ కాన్సెంట్ ను ఉప సంహరించుకున్నట్లు తెలుస్తోంది. ఆ ఏడారి మార్చిలో మేఘాలయ కూడా జనరల్ కాన్సెంట్ ను వెనక్కు తీసుకుని 9 రాష్ట్రంగా నిలిచింది. ఇక్కడ బీజేపీనే అధికారంలో ఉండడం గమనార్హం. అయితే, రాష్ట్రంలో జరిగిన బొగ్గు కుంభకోణం ప్రకంపనలు రేపడంతో అక్కడి ప్రభుత్వం సీబీఐకి మోకాలడ్డుతోంది. తాజాగా తెలంగాణ కూడా జనరల్ కాన్సెంట్ ను వెనక్కుతీసుకుంది.

నిన్న కోర్టుకు చెప్పారు..

తెలంగాణ సర్కారు సీబీఐకి జనరల్ కాన్సెంట్ ఉప సంహరించుకుని దాదాపు రెండు నెలలైనా బయటకు రాలేదు. మీడియా కూడా పసిగట్టలేదు. అయితే, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై శనివారం కోర్టులో వాదనల సందర్భంగా ప్రభుత్వం న్యాయవాది.. సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం జనరల్ కాన్సెంట్ ఉప సంహరించుకున్నట్లు వెల్లడించారు. అనంతరం ఆదివారం అందుకు సంబంధించిన ఉత్తర్వులు బయటకు రావడం గమనార్హం. చూద్దాం.. దీనిపై ప్రతిపక్షాలు ఏం రాద్ధాంతం చేస్తాయో...?
Tags:    

Similar News