భయం.. గ్రాములెక్క కాదు.. ఇప్పుడు టన్నుల్లో కాంగ్రెస్ ను వెంటాడుతోంది. ఆ భయంతోనే ఇప్పుడు పోటీచేయడానికి కూడా వెనుకాడే పరిస్థితి నెలకొంది.. డబ్బు - పరపతి - కేడర్ ఉండి కూడా కాంగ్రెస్ తరుఫున పోటీచేయడానికి వెనుకాడుతున్నారంటే వాళ్ల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు..
కొండా మురళి-సురేఖ.. పరకాలతో పాటు వరంగల్ జిల్లా మొత్తం ప్రభావం చూపగల నేతలు. అందుకే పోయిన సారి వరంగల్ తూర్పులో పోటీచేసినా సురేఖ గెలిచారు.కానీ రెండో దఫా మాత్రం టీఆర్ ఎస్ టికెట్ ఇవ్వలేదు.. కాంగ్రెస్ లో చేరి పరకాల నుంచి పోటీచేసిన సురేఖ ఓడిపోయింది.
తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ - టీఆర్ ఎస్ హవా నడుస్తోంది. ఆ గాలికి ఎదురెళ్లి గెలవడం కష్టమని అందరికీ అర్థమైంది. అందుకే కాంగ్రెస్ నేతల్లో భయం వెంటాడుతోంది. తాజా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా టికెట్ ఇస్తానన్నా కొండా మురళి కానీ.. సురేఖ కానీ సాహసించ లేదంటే టీఆర్ ఎస్ హవానే కారణం.. ఎదురెళ్లి మళ్లీ ఓడిపోవడం ఇష్టం లేకే వారు టికెట్ ను వదులుకోవడం విశేషం.
ఇక కరీంనగర్ ఎంపీగా పోటీచేసిన పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. మాటల తూటాలు పేల్చగల ఆయన కరీంనగర్ ఎంపీగా కనీస పోటీ ఇవ్వకపోవడం గమనార్హం. ఇక్కడ పోటీ టీఆర్ ఎస్-బీజేపీ మధ్యే ఉండడం విశేషం. ఇలా ఎంత ప్రయత్నించినా.. ఎంత దూసుకుపోయినా ఇప్పుడు జనాలు - నాయకులు అంతా గులాబీ మాయలో పడిపోయారు. అందుకే ఆయన అఫిడవిట్లు అంటూ ఎంత ప్రయత్నించినా టీఆర్ ఎస్ హోరు ముందర తట్టుకోలేకపోయారు. ప్రస్తుతం ఓటమి భయం కాంగ్రెస్ ను వెంటాడుతోంది. మున్ముందు మున్సిపల్ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ తరుఫున పోటీచేయడానికి నేతలు సాహసించని పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు..