ప్రధాన ప్రతిపక్షం ఎలా ఉండాలి.. ప్రభుత్వ వైఫల్యాలపై తాట తీయాలి. సమస్యలపై గొంతు ఎత్తుతూ ముప్పు తిప్పలు పెట్టాలి. మూడు చెరువుల నీళ్లు తాగించాలి. కానీ తెలంగాణలో కాంగ్రెస్ నేతలు కుర్చీ కోసం కొట్టుకుంటున్నారు. శనివారం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ నేతలు వీహెచ్, నగేష్ లు చొక్కాలు పట్టుకొని కొట్టుకొని పరువు తీశారు.. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టి కార్నర్ చేయాల్సిందిపోయి వారే డిఫెన్స్ లో పడిపోయారు.
కాగా ఇలా నడిబజారులో కొట్టుకోవడం.. సీనియర్ నేత వీహెచ్ పై నగేశ్ ఉద్దేశపూర్వకంగా దాడి చేసినట్టు కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది. ఈ గొడవను తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్ పార్టీ కమిటీ చైర్మన్ కోదండరాం ఆధ్వర్యంలో చర్చించింది. నగేష్ ను పార్టీ నుంచి బహిష్కరించాలని దాదాపు నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఘటనపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, సీనియర్ నేత షబ్బీర్ అలీ కమిటీ నివేదిక ఇవ్వాలని కుంతియా ఆదేశించారు. ఆ నివేదిక తర్వాత నగేష్, లేదా వీహెచ్ పై చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి..
ఒక కుర్చీ కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొట్టుకోవడం టీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇదీ తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అంటూ వారు ఎద్దేవా చేస్తున్నారు. టీఆర్ఎస్ ను ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఇబ్బంది పెట్టదని.. రేపోమాపో టీఆర్ఎస్ లోనే కాంగ్రెస్ విలీనం అయిపోతుందని పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షం ఉనికి లేకుండా చేయాలనకుంటున్న కేసీఆర్ కు కాంగ్రెస్ నేతల అనైక్యత బాగానే కలిసివచ్చేట్టు ఉంది.