టార్గెట్ కేసీఆర్‌.. టీ-బీజేపీ నేత‌ల‌కు అమిత్ షా దిశానిర్దేశం

Update: 2023-03-01 08:00 GMT
తెలంగాణ బీజేపీ నాయ‌కుల‌కు.. కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు పలు అంశాల‌పై దిశానిర్దేశం చేశారు. ``టార్గెట్ కేసీఆర్‌`` నినాదంతోనే ప‌నిచేయాల‌ని సూచించారు. కేసీఆర్ కుటుంబ పాల‌న‌.. అవినీతిపైనే యుద్ధం చేయాల‌ని తేల్చి చెప్పారు. అదేస‌మ‌యంలో ఇత‌ర విష‌యాల జోలికిఅస‌లు వెళ్లొద్ద‌న్నారు. అదేస‌మ‌యంలో పార్టీలో ఐక్య‌త‌కు అత్యంత ప్ర‌ధాన పీట వేయాల‌ని దిశానిర్దేశం చేశారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ స‌మావేశంలో తెలంగాణ‌లో బీజేపీ భవిష్యత్ కార్యాచరణ, వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సి న వ్యూహాలు, ప్రణాళికలపై చర్చించారు.

రాష్ట్రంలో కొనసాగుతున్న పార్టీ కార్యక్రమాల గురించి ఆరా తీసిన అధినాయకత్వం.. బీజేపీ బలోపేతానికి చేపట్టే కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఢిల్లీలో వెలుగు చూసిన లిక్క‌ర్ స్కామ్‌, కేసీఆర్ కుటుంబ పాలనను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నేతలకు షా సూచించారు.

ముఖ్య నేతలు ప్రజల్లోకి వెళ్లాలని.. అనవసర అంశాల జోలికి వెళ్లకూడదని అధిష్ఠానం పలు సూచనలు చేసింది. రాష్ట్రంలో కార్యక్రమాలు నిర్వహించేందుకు బండి సంజయ్కి స్వేచ్ఛను ఇచ్చారు. ఆయ‌న నేతృత్వంలోనే ఇత‌ర నేత‌లు క‌లిసి ప‌నిచేయాల‌ని సూచించారు.

కేసీఆర్ సర్కారు వైఫల్యాలను ఎండగట్టేలా కార్యక్రమాలు నిర్వహించాలని నేతలను అమిత్ షా ఆదేశించారు.  పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు పాత, కొత్త కలయికతో సమిష్టిగా ప్రజల్లోకి వెళ్లాలని సూచించింది.  బీఆర్ఎస్ - కాంగ్రెస్ పార్టీలు ఒక వ్యూహం ప్రకారం తమ పార్టీకి అభ్యర్థులు లేరనే ప్రచారం చేస్తున్నాయని... రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని బండి సంజయ్ అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News