ఉద్యోగసంఘాల మధ్య దూరం పెరిగిందా?

Update: 2015-07-17 08:46 GMT
తెలంగాణ ఉద్యమం సమయంలో అంతా కలిసి ప‌నిచేసిన తెలంగాణ ఉద్యోగ సంఘాల మ‌ధ్య దూరం పెరిగిందా? ఉద్య‌మాన్ని న‌డిపించిన నాయ‌కులు ప్ర‌భుత్వానికి ద‌గ్గ‌ర కావ‌డం..అదే స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ప్ర‌భుత్వం ఉద్యోగుల ప‌ట్ల అవ‌లంభిస్తున్న తీరుతో ఉద్యోగ సంఘాల్లో తేడాలు వ‌చ్చాయా?  కొన్నివ‌ర్గాలు స‌ర్కారుతో తేల్చుకుందామంటే..మ‌రికొన్ని సంఘాలు నో అంటున్నాయా? అంటే అవున‌నే సందేహాలు వ‌స్తున్నాయి.

తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులుగా స్వామిగౌడ్‌, విఠల్‌, శ్రీనివాస్‌గౌడ్‌లు ఉన్నప్పుడు అంతా ఏకతాటిపై నడిచేవారు. ఇపుడు వారంతా ప్ర‌భుత్వంలో కీల‌క ప‌ద‌వుల్లో ఉన్నారు. దీంతో స‌మ‌న్వ‌యం అనే ప‌రిస్థితి లేకుండా టీమ్‌ చెల్లాచెదురైన‌ట్లు క‌నిపిస్తోంది. ఉద్యమంలో అన్ని ఉద్యోగ సంఘాలు ఒకేలా పోరాడినా...ఇప్పుడు ప్రాధాన్యం అంతా ఒకే సంఘానికి  దక్కుతుందని మిగతా వాళ్లు అసంతృప్తితో ఉన్నారని స‌మాచారం.

టీఎన్జీవోలకు, రెవెన్యూ సంఘాలకు మధ్య దూరం పెరిగింద‌ని అభిప్రాయం వినిపిస్తోంది. అన్ని విషయాలు టీఎన్జీవోలతోనే మాట్లాడితే మాకేంటి అని రెవిన్యూ అసోసియేషన్ ఉద్యోగ సంఘాల‌ చర్చలను వాయిదా వేసిన‌ట్లు స‌మ‌చారం. దీంతో రెండు సంఘాల మధ్య ఘర్షణ  వాతావరణం ఏర్పడిన‌ట్లు తెలుస్తోంది. ఉద్యోగ సంఘాల్లో కీలకంగా ఉండే ఓ సంఘం  ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండటంతో ఇబ్బంది లేదని, నిజానికి ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటూనే సమయం వచ్చినప్పుడు  ప్రభుత్వంతో పనిచేయించాల‌ని కొంద‌రు నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే అలా జరగట్లేదని...ఉద్యోగుల్ని కాంప్రమైజ్ చేసేలా ఆ సంఘం నేతలు వ్యవహరిస్తున్నారని వాళ్లు మండిప‌డుతున్నారు.

మొత్తంగా తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీలో కీలకంగా ఉండే సంఘాల మధ్యే ఘర్షణలు రావటం ఉద్యోగులను కలవరపరుస్తోంది. తమ  డిమాండ్ల సాధన విషయంలో ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి జంకుతున్నారన్న అభిప్రాయం  కూడా ఉద్యోగుల్లో ఉంది
Tags:    

Similar News