పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదికి స్వాగతం పలికే వేళ తెలుగు రాష్ట్రాల్లో మద్యం ఏరులై పొంగింది. మద్యం ప్రియులు కిక్కులో మునిగి తేలారు. ఒక్క రోజులో రెండు రాష్ట్రాల ప్రజలు ఏకంగా రూ.236 కోట్ల రూపాయల విలువైన సరకును తాగేశారు. ఇందులో తెలంగాణదే పైచేయి. తెలంగాణలో డిసెంబరు 31న రూ.133 కోట్ల మద్యం అమ్ముడుపోగా.. ఏపీలో ఆ విలువ రూ.103 కోట్లుగా నమోదైంది. అబ్కారీ శాఖ ఈ మేరకు మద్యం అమ్మకాల లెక్కలు విడుదల చేసింది.
సాధారణంగా తెలంగాణలో రోజుకు రూ.50-70 కోట్ల విలువైన మద్యం విక్రయాలు సాగుతాయి. ఏపీలో ఆ సగటు రూ.45-55 కోట్లుగా ఉంది. డిసెంబరు చివరి వారంలో మాత్రం మద్యం విక్రయాలు జోరుగా కొనసాగాయి. ఒక్క వారంలోనే తెలంగాణలో రూ.650 కోట్లు, ఏపీలో రూ.500 కోట్ల మద్యం అమ్ముడుపోయింది. డిసెంబరులో మొత్తంగా తెలంగాణలో రూ.1,962 కోట్ల మద్యం విక్రయించారు. ఏపీలో ఈ విలువ రూ.1,732 కోట్లుగా నమోదైంది. దీంతో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ఖజానాలకు భారీగా ఆదాయం సమకూరింది.
తెలంగాణలో జిల్లాల వారీగా డిసెంబరు 31 నాటి గణాంకాలను పరిశీలిస్తే.. అత్యధికంగా హైదరాబాద్ లో రూ.19.5 కోట్లు, రంగారెడ్డిలో రూ.15.30 కోట్లు, ఉమ్మడి వరంగల్ లో రూ.18 కోట్లు, మేడ్చల్ జిల్లాలో రూ.11.90 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. మొత్తంగా 2018లో తెలంగాణలో రూ.20 వేల కోట్ల మద్యాన్ని విక్రయించారు. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన కొన్ని ఈవెంట్లలో నిర్వాహకులు ‘అన్ లిమిటెడ్’ ఆఫర్లు ప్రకటించారు. దీంతో చాలామంది మద్యం ప్రియులు నిర్ణీత రుసుము చెల్లించి ఆయా వేడుకల్లో పూటుగా మద్యం పుచ్చుకున్నారు.
Full View