రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమాలకు చెక్ .. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం !
సాధారణంగా రిజిస్ట్రేషన్ శాఖ లో ఎక్కువ అక్రమాలు జరుగుతుంటాయని చెప్తుంటారు. దీనితో ఆ శాఖలో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. స్టాంపు డ్యూటీ వసూళ్ల సందర్భంగా భూముల మార్కెట్ విలువను తగ్గించే రిజిస్ట్రేషన్ అధికారుల విచక్షణాధికారాలను తొలగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీని కోసం ‘ఇండియన్ స్టాంపు యాక్ట్-1899’ను సవరించి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపాలని అనుకుంటున్నారు. అంతకంటే ముందుగా దీనిపై ఆర్డినెన్స్ ను తెచ్చేలా కసరత్తు చేస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ ఇటీవల శాసన మండలిలో ప్రస్తావించడం కూడా ఈ చర్యలకు ఊతమిస్తోంది. ఈ ఆర్డినెన్స్ పై ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులు కసరత్తు చేస్తున్నారు.
త్వరలో గవర్నర్ ఆమోదం కోసం ఆర్డినెన్స్ ను పంపిస్తారని సమాచారం. వాస్తవానికి రాష్ట్రంలోని భూములు, స్థలాలు, భవనాల క్రయ విక్రయాలపై ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ విలువపై రిజిస్ట్రేషన్ల శాఖ 6 శాతం స్టాంపు డ్యూటీని వసూలు చేస్తుంది. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరిగే సందర్భంలో దీనిని చలానా రూపంలో తీసుకుంటుంది. ఇండియన్ స్టాంప్ యాక్ట్-1899లోని సెక్షన్ 47 ప్రకారం ఒక వ్యక్తి తాను కొనుగోలు చేస్తున్న భూమి విలువ బహిరంగ మార్కెట్ విలువ కంటే ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ విలువ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎక్కువగా ఉందని భావిస్తే, సబ్-రిజిస్ట్రార్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. భూమి మార్కెట్ విలువను తగ్గించి, ఆ విలువ ప్రకారమే స్టాంప్ డ్యూటీని వసూలు చేయాలంటూ అప్పీల్ చేసుకోవచ్చు. సబ్-రిజిస్ట్రార్ ఈ దరఖాస్తును జిల్లా రిజిస్ట్రార్ కు పంపిస్తాడు. డీఆర్ దానిని పరిశీలించి రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ కు పంపిస్తారు.
ఐజీ దీనిపై నిర్ణయం తీసుకుంటారు. దరఖాస్తుదారుడు కోరిన మేరకైనా తగ్గించవచ్చు లేదా కొంత వరకే తగ్గించవచ్చు. ఐజీకి మాత్రమే విచక్షణాధికారం ఉంది. ఐజీ నిర్ణయించిన మార్కెట్ విలువ ఆధారంగా సబ్-రిజిస్ట్రార్ స్టాంప్ డ్యూటీని వసూలు చేసి, భూమిని రిజిస్టర్ చేస్తాడు. ఇదివరకు ఈ విచక్షణాధికారం జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలకు ఉండేది. వారిపై పని ఒత్తిడిని తగ్గించేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనల మేరకు ఈ అధికారాలను జిల్లా రిజిస్ట్రార్లకు మార్చారు. సబ్-రిజిస్ట్రార్ దరఖాస్తు పంపగానే.. డీఆర్ లు ఆమోదించి మార్కెట్ విలువలను తగ్గించే వారు. దాంతో రిజిస్ట్రేషన్ల శాఖకు స్టాంపు డ్యూటీ రూపేణా రావాల్సిన రాబడి తగ్గేది. పైగా డీఆర్ లు, సబ్-రిజిస్ట్రార్లు దరఖాస్తు దారులతో కుమ్మక్కై మార్కెట్ విలువలను ఘోరంగా తగ్గించేవారన్న విమర్శలున్నాయి.దీనితో ఆర్డినెన్స్ ను తేవాలని యోచిస్తోంది.
ఇండియన్ స్టాంప్ యాక్ట్‌లోని సెక్షన్ 47(ఏ)ను సవరిస్తూ తెచ్చే ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదం కోసం పంపనున్నారు. ఈ స్టాంప్ చట్టం కేంద్ర తీసుకొచ్చిన చట్టమైనందున... దీనిని సవరించడానికి కుదరదు. శాసన సభా సమావేశాల్లో ఈ ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. అనంతరం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతారు. అయితే, రాష్ట్రపతి ఆమోదం పొందాలంటే చట్టంలోని సెక్షన్ సారాంశంలో ఏమాత్రం తేడా ఉండకూడదని నిపుణులు అంటున్నారు. రాష్ట్రపతికి వెళ్లే సవరణ అంశాన్ని కేంద్ర హోంశాఖ పరిశీలిస్తుందని, హోంశాఖ ఆమోదిస్తేనే, రాష్ట్రపతి ముద్ర వేస్తారని చెబుతున్నారు. ఇది అంత సులభం గా సాధ్యం కాక పోవచ్చని అభిప్రాయ పడుతున్నారు. చూడాలి మరి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో..