రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించే లక్ష్యంతో నేడు ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్.. పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖను ఆధునీకరించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ సమర్థవంతంగా జరిగేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకున్నది. గుడుంబా నిర్మూలన, పేకాట క్లబ్బుల నిషేధం వంటివి పటిష్టంగా అమలు చేసింది.
ప్రతి స్టేట్ డ్రగ్స్‌కి అడ్డాగా మారిపోతున్నాయ్. కొన్ని స్టేట్స్‌లో అయితే పాలిటిక్స్ మొత్తం డ్రగ్స్ చుట్టూనే తిరుగుతున్నాయి. డ్రగ్స్ ఇష్యూతోనే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో రచ్చరచ్చ జరుగుతోంది. తెలంగాణలో రోజురోజుకీ పరిస్థితి శృతి మించుతోంది. హైదరాబాద్‌లో పబ్స్, క్లబ్స్ , డ్రగ్స్ కి కేరాఫ్ గా మారిపోతున్నాయి. దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడ్డా హైదరాబాద్ లోనే లింకులు బయటపడుతున్నాయి. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల మాఫియా పెచ్చుమీరుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మాదకద్రవ్యాల విక్రయాలు నిరోధించేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ పోలీస్, ఎక్సైజ్ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
డ్రగ్స్ నియంత్రణ కోసం పోలీసులు, ఎక్సైజ్ ఉన్నతాధికారులతో హైలెవల్ మీటింగ్ నిర్వహించారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ఎంతటి వారు ఇన్వాల్స్ అయినా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణ స్టేట్‌లో డ్రగ్స్ మత్తు వదిలించేందుకు ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా రంగంలోకి దిగారు. తెలంగాణను డ్రగ్ ప్రీ స్టేట్ గా మార్చాలంటూ ఆదేశించారు. రాష్ట్రంలో గుడుంబా, పేకాట నియంత్రణ పటిష్టంగా అమలవుతున్నప్పటికీ అక్కడక్కడా తిరిగి తలెత్తుతున్నట్టు తెలుస్తున్న నేపథ్యంలో తీసుకోవలసిన కఠిన చర్యలపై సమావేశంలో చర్చిస్తారు. మాదకద్రవ్యాల బారిన పడి యువత నిర్వీర్యం కాకూడదనే లక్ష్యంతో రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చేందుకు చేపట్టవలసిన కార్యాచరణను రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు.