తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Update: 2020-08-27 12:10 GMT
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అనుమతులు లేని స్థలాలు, భవనాల రిజిస్ట్రేషన్ ను పూర్తిగా నిషేధిస్తూ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. కొత్త మున్సిపల్ , పంచాయితీ చట్టం ప్రకారం.. లే అవుట్ అనుమతి, బిల్డింగ్ ప్లాన్ అనుమతి లేనటువంటి స్థలాలను, భవనాలను రిజిస్ట్రేషన్ చేయవద్దని సంచలన ఆదేశాలు జారీ చేసింది.

ప్రధానంగా ఈ నిర్ణయానికి కారణం.. కొనుగోలుదారులు మోసపోకుండా.. అక్రమ రిజిస్ట్రేషన్లు జరగకుండా.. ప్రభుత్వ ఆస్తులు, భూములు కబ్జా కాకుండా చూసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు నుంచి అక్రమ రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కావు.  మున్సిపాలిటీ, గ్రామపంచాయితీ ఆమోదించిన ప్లాన్ ప్రకారం నిర్మించిన భవనాలు, ప్లాట్లకే రిజిస్ట్రేషన్ చేయాలని మార్గదర్శకాలు విడుదల చేశారు.

అయితే రాష్ట్రంలో అనధికార లేఅవుట్లలో ఉన్న ప్లాట్లు ఎక్కువగా ఉండడంతో దీని ప్రభావం రిజిస్ట్రేషన్ల శాఖపై పడి ఆదాయం గణనీయంగా పడిపోతుందన్న ఆందోళన అధికారుల్లో ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు, వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో రిజిస్ట్రేషన్లు తగ్గే అవకాశం కనిపిస్తోంది.

ఇప్పటికే కరోనా లాక్ డౌన్ తో ఆదాయం తగ్గిన రిజిస్ట్రేషన్ల శాఖకు ఇప్పుడు తాజా నిబంధనలతో మరింత నష్టం వాటిల్లడం ఖాయం అంటున్నారు. మధ్యతరగతి ప్రజలు కూడా ఈ నిబంధనలు తెలియకుండా స్థలాలు కొని నష్టపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
Tags:    

Similar News