ఎప్పటికప్పుడు వరాల మూటను జనాల మీదకు వదిలే సంపన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారి జనాల మీద భారాన్ని మోపారు. నిత్యం భరోసా మాటలు చెబుతూ.. బంగారు తెలంగాణ తమతోనే సాధ్యమని.. ప్రజలకు ఎలాంటి కష్టం లేకుండా చూసుకుంటూ పాలించటం తమకు మాత్రమే సాధ్యమని చెప్పే ఆయన మాటలకు భిన్నంగా.. స్వల్పంగా పెంచినట్లు చెప్పిన కరెంటు ఛార్జీల భారం మొత్తం 1500 కోట్ల రూపాయిలకు పైనే ఉండటం గమనార్హం.
తాజాగా పెంచిన విద్యుత్ ఛార్జీల పెంపు కారణంగా.. జనాల జేబుల్లో నుంచి 1527 కోట్ల రూపాయిలు ఖజానాకు చేరనున్నాయి.
ఈ పెంచిన ఛార్జీల భారాన్ని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా జులై 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. వంద యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారుల మీద భారం ఉండదని.. అంతకంటే ఎక్కువ విద్యుత్ వినియోగించే గృహ వినియోగదారుల మీద భారం స్వల్పమేనని తెలంగాణ సర్కారు చెప్పింది. మరి.. ఆ స్వల్పం అనే మాటను రూపాయిల్లో లెక్క వేస్తే ఒక్క గృహ వినియోగదారుల మీదనే రూ.510 కోట్ల భారం పడనున్నట్లు తెలిసింది. కేసీఆర్ సర్కారు స్వల్పంగా ఛార్జీల పెంపు అంటేనే ఇంత భారీ ఆదాయం వస్తే.. ఈ లెక్కన ఒక మోస్తరు భారం అంటే ఇంకెన్ని వేల కోట్లు జనాల జేబుల్లో నుంచి వెళ్లిపోతాయో..?
ఇక.. పెరిగిన విద్యుత్ ఛార్జీల ప్రభావం ఎలా ఉంటుందనటానికి సింఫుల్ ఎగ్జాంఫుల్ ఒకటి చూస్తే.. ఒక ఇంట్లో విద్యుత్ వినియోగం 301 యూనిట్లుగా ఉందని అనుకుందాం. ఇప్పటివరకూ అన్ని ఛార్జీలు కలిపి.. కరెంటు బిల్లు రూ.1580 వరకూ వస్తుంది. తాజాగా మారిన ఛార్జీల నేపథ్యంలో ఇప్పుడా బిల్లు ఏకంగా రూ.1728.50గా రానుంది. అంటే.. 301 యూనిట్ల విద్యుత్ ను నెలసరి వినియోగించే వారి మీద పడే భారం ఏకంగా 148.50 రూపాయిలుగా ఉండటం గమనార్హం.