మళ్లీ తెలంగాణా ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ ..ఈ సారి దేనికంటే ?

Update: 2020-08-16 08:31 GMT
తెలంగాణ హైకోర్టు మరోసారి తెలంగాణ ప్రభుత్వం పై సీరియస్ అయింది. చెరువులు ఆక్రమణలకు గురవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ హైకోర్టు తెలంగాణ సర్కార్ ను, అధికారులను ప్రశ్నించింది. వీటి పరిరక్షణకు ఎందుకు చర్యలు తీసుకోలేదో తెలపాలని, అదేవిధంగా గరిష్ట నీటి మట్టానికి సంబంధించిన అన్ని మ్యాపులు కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఖాజాగూడ చెరువు దురాక్రమణకు గురవుతోందంటూ సోషలిస్ట్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ లుబ్నా సావత్‌ రాసిన లేఖను హైకోర్టు సుమోటో ప్రజాహిత వ్యాజ్యంగా స్వీకరించింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌ రెడ్డి తో కూడిన ధర్మాసనం సోమవారం దీన్ని విచారించింది.  ఖాజాగూడ చెరువు దురాక్రమణకు గురవుతుందని కలెక్టర్ కు ఆదేశించినా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. ఆ అధికారి బదిలీ అయ్యారని, ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను సమర్పించేందుకు కొంత గడువు కావాలని కోరారు. గతంలో ఆదేశించినా చెరువుల పరిరక్షణకు కమిటీలను ఎందుకు ఏర్పాటు చేయలేదని నిలదీసింది. ప్రభుత్వం మేల్కొని తగిన చర్యలు చేపట్టకపోతే తెలంగాణ కూడా రాజస్తాన్‌ ఎడారిలా మారుతుందని హైకోర్టు హెచ్చరించింది.  అలాగే చెరువుల పరిరక్షణకు ఎలాంటి కమిటీలు వేస్తారు..  ఎలాంటి చర్యలు తీసుకుంటారో కోర్టుకు తెలపాలంది. ఆ తర్వాత ఈ కేసును  సెప్టెంబర్ 8 కి   వాయిదా వేసింది. 
Tags:    

Similar News