సిట్ కు కీలక ఆదేశాలు జారీ చేసిన టీహైకోర్టు

Update: 2023-03-21 18:00 GMT
సంచలనంగా మారిన టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఈ రోజు (మంగళవారం) తెలంగాణ హైకోర్టులో వాడీవేడీ వాదనలు చోటు చేసుకున్నాయి. ఈ కేసుకు సంబంధించిన విచారణ ఈ రోజు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ కైన్సిల్ వివేక్ ధన్కా వాదనలు వినిపించగా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. మరి.. ఈ సందర్భంగా ప్రభుత్వ వాదన ఏమిటి? దానికి పిటిషనర్ల తరఫున న్యాయవాది చేసిన వాదనలు ఏమిటి? అన్న విషయాల్లోకి వెళితే..

ప్రభుత్వం తరఫున న్యాయవాది వినిపించిన వాదనలివే..

-  ఓయూ విద్యార్థులు కోర్టులో పిటిషన్లు వేశారు. న్యాయస్థానంలో వారు దాఖలు చేసిన పిటిషన్.. అఫిడవిట్ అన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా ఫైల్ చేసినవే.

-  ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేశారు. పిటిషన్లు ఇద్దరే అరెస్టు అయ్యారంటున్నారు.

-  రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ పిటిషన్ వేశారు. హైప్ కోసం ఇలాంటి పిటిషన్లు వేయటం కామన్ అయిపోయింది.

-  టీఎస్ పీఎస్సీ బోర్డుకు చెందిన ఇద్దరితో పాటు మిగిలినవారిని పోలీసులు అరెస్టు చేశారు

-  రాజకీయ దురుద్దేశంతో ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. పిటిషనర్ కు లోకస్ స్టాండీ లేదు. విచారణ అర్హత లేదు.
-  పేపర్ లకేజీ విషయంలోసిట్ సమగ్ర దర్యాప్తు చేస్తోంది.

పిటిషన్ల తరఫు న్యాయవాది వినిపించిన వాదనలివే..

-  మొత్తం ఆరు పరీక్షల్ని రద్దు చేశారు. 5 లక్షల మంది వివిధ పరీక్షలకు అప్లై చేశారు. 3.5 లక్షల మంది సివిల్స్ రాశారు. 25 వేల మంది ప్రిలిమ్స్ లో ఎంపికయ్యారు. ఈ నెల 28న మంత్రి కేటీఆర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇద్దరు మాత్రమే పేపర్ లీక్ చేశారని ఆయన ఎలా చెబుతారు.

- ఒక మంత్రి ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారు?

-  టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. కానీ.. ఇందులో ఇద్దరు మాత్రమే నిందితులు అని రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇలా చెప్పటంలో కుట్ర కోణం దాగి ఉంది.

-  ఒకే మండలానికి చెందిన 20 మందికి మంచి మార్కులు వచ్చాయి. దీనిపై అనుమానాలు ఉన్నాయి. ఈ కేసును సీబీఐకు అప్పగిస్తే.. నిజనిజాలు బయటపడతాయి.

-  ఇప్పటివరకు ఏఈ, గ్రూప్ 1, ఏఈఈ, డీఏవో పరీక్షలను టీఎస్‌పీఎస్సీ బోర్డ్ రద్దు చేసింది. ఈ లీకేజీపై సమగ్ర విచారణ చేపట్టాలి.

- ఐటీ మంత్రి కేటీఆర్ కేవలం ఇద్దరికి మాత్రమే సంబంధం ఉందని ఎలా చెబుతారు? కేసు మొదటి దశలోనే ఇద్దరి ప్రమేయం ఉందని చెప్పటం ఏమిటి? ఇక్కడి పోలీసులపై నమ్మకం లేదు

-  సీబీఐ ద్వారానే విచారణ జరగాలి. టీఎస్ పీఎస్సీ క్వాలిఫై అయిన అభ్యర్థుల వివరాలు అధికారిక వెబ్ సైట్లో  ఎందుకు పెట్టలేదు?

-  ఈ ఉదంతంపై సీబీఐ చేత కానీ స్వతంత్ర్య దర్యాప్తు సంస్థతో దర్యాప్తు జరిపించాలి.
ఇరు వర్గాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు స్పందిస్తూ.. ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 11కు వాయిదా వేసింది. అదే సమయంలో ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కోరింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News