రాయలసీమ ఎత్తిపోతల : 24 కి విచారణ వాయిదా వేసిన టీ హైకోర్టు - ఎల్‌-1గా ఎస్పీఎంఎల్‌

Update: 2020-08-19 09:10 GMT
ఆంధ్ర ప్రదేశ్  ప్ర‌భుత్వం చేప‌ట్టిన రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కంపై తెలంగాణ హైకోర్టు నేడు విచార‌ణ చేప‌ట్టింది. కాంగ్రెస్ నేత‌లు వంశీచంద్ రెడ్డి, గ‌వినోళ్ల  శ్రీ‌నివాస్ దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై  జ‌స్టిస్ ఎంఎస్ రామచంద్రారావు నేతృత్వంలోని బెంచ్ విచార‌ణ చేప‌ట్టింది.రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం ఆపాలంటూ కేంద్ర ప్ర‌భుత్వం, కృష్ణా రివ‌ర్ బోర్డ్ ఆదేశించిన‌ప్ప‌టికీ ఏపీ స‌ర్కార్ ప్రాజెక్టు ను ఆప‌టం లేద‌ని పిటిష‌నర్లు కోర్టు కు తెలిపారు. ఈ ప్రాజెక్టు వ‌ల్ల కింద‌నున్న బేసిన్ లోని ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది అని , ఏపీ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం లోని సెక్ష‌న్ 84కు విరుద్ధం గా ఏపీ రాయ‌ల‌సీమ ఎత్తి పోత‌ల ప‌థ‌కం చేప‌డుతుంద‌ని పిటిష‌నర్ న్యాయ‌వాది శ్ర‌వ‌ణ్ కుమార్ కోర్టుకి తెలిపారు.  అయితే , దీనిపై ఇప్పటికే సుప్రీం కోర్టులో కేసు నమోదు అయింది అని ,  శుక్రవారం విచారణ కు వచ్చే అవకాశం ఉందని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు విచారణ తర్వాత సోమవారం విచారణ చేపట్టాలని ఏపీ న్యాయవాది కోరటం తో కేసు ను సోమ‌వారం విచారించేందుకు కోర్టు అంగీకరించి ఆగస్ట్ 24 కి ఈ కేసు విచారణ వాయిదా వేసింది.

 ఇకపోతే , ఈ రాయ‌ల‌ సీమ ఎత్తి పోత‌ల  టెండర్‌ ను రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ ఆమోదం తెలిపింది. రూ.3,307.07 కోట్లకు కోట్‌ చేసి ఎల్‌-1గా నిలిచిన ఎస్పీఎమ్మెల్ (సుభాష్‌ ప్రాజెక్ట్స్ మ్యానుఫాక్చరర్స్‌ లిమిటెడ్‌-జేవీ)కి పనులను అప్పగించడానికి మంగళవారం  ఆమోదం ఇచ్చింది. ఈ మేరకు కర్నూల్‌ జిల్లా ప్రాజెక్ట్స్ సీఈకి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  టెక్నికల్‌ బిడ్లలో ఎస్పీఎంఎల్‌-మేఘా-ఎన్‌ సీసీ జాయింట్‌ వెంచర్‌, నవయుగ ఇన్ ‌ఫ్రా, మరియు మ్యాక్స్‌ ఇన్‌ ఫ్రా సాంకేతిక అర్హత ను సాధించాయి.  అయితే ,  ఫైనాన్సియల్‌ బిడ్లలో ఎల్‌-1గా నిలిచిన ఎస్పీ ఎమ్మెల్ కి ఈ ప్రాజెక్ట్ దక్కింది. ఈ ప్రాజెక్ట్ 30 నెలల్లో ప్రాజెక్టు ను పూర్తి చేయాలని అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు.

కాగా, శ్రీశైలం జలాశయంలో 797 అడుగుల నుంచి రోజుకు మూడు టీఎంసీలను పీహెచ్‌ ఆర్‌ దిగువన శ్రీశైలం కుడి ప్రధాన కాలువలో 4 కిమీ వద్దకు ఎత్తిపోసి, తెలుగుగంగ, గాలేరు-నగరి, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్‌ ఆయకట్టుకు నీళ్లందించే ఉద్దేశం తో రాయలసీమ ఎత్తి పోతలను రూపొందించారు.
Tags:    

Similar News