అంబులెన్సుల్ని హైకోర్టు అపొద్దన్న తర్వాత.. ఏమైందో తెలుసా?

Update: 2021-05-12 04:18 GMT
ప్రయోజనాల కోణంలో.. రాజ్యాంగ విధానాల్ని అనుసరించి.. ఒక విషయం మీద విస్పష్ట వ్యాఖ్యలు చేయటమే కాదు.. ఇలా చేయండని స్వయంగా రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత అయినా పరిస్థితుల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. కానీ.. అందుకు భిన్నంగా అలాంటి పరిస్థితి లేకపోవటం దేనికి నిదర్శనం. సోమవారం ఏపీ నుంచి వచ్చిన అంబులెన్సుల్ని తెలంగాణ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టుల వద్ద నిలిపివేయటంతో పలువురు కరోనా పేషెంట్లు నానా ఇబ్బందులకు గురయ్యారు.

హైదరాబాద్ కు చెందిన వివిధ ఆసుపత్రుల్లో ఆడ్మిట్ కావటానికి అవసరమైన అన్ని పత్రాలు ఉన్నప్పటికీ.. నో చెప్పిన వైనంపై పెద్ద ఎత్తున విమర్శలు రావటం.. దీనిపై తెలంగాణ హైకోర్టు స్పందించి.. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అంబులెన్సుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దని స్పష్టం చేసింది. మరిలా చెప్పిన తర్వాత ఏం జరిగింది? ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? అన్నది చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే.

ఎందుకంటే.. ఏపీ నుంచి వచ్చిన అంబులెన్సుల్నిపోలీసులు ఆపటం షాకింగ్ గా మారింది. ఈ సందర్భంగా పోలీసుల వాదన విచిత్రంగా ఉందని చెబుతున్నారు. హైదరాబాద్ లోని ఆసుపత్రుల ల్యాండ్ లైన్ నెంబరు నుంచి ఫోన్ వస్తే మాత్రమే తాము వాహనాల్ని వదిలిపెడతామని చెప్పి.. రెండు.. మూడింటికి మాత్రమే అనుమతి ఇచ్చి మిగిలిన వాటిని వెనక్కి పంపటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఏపీ అధికారపక్ష నేతలు సైతం ఈ తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు విస్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఇలాంటి పరిస్థితేమిటని ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణ పోలీసులు రెండో రోజు కూడా అంబులెన్సుల్ని అడ్డుకుంటున్నారనే విషయాన్ని తెలుసుకున్న ప్రభుత్వ విప్.. ఎమ్మెల్యే ఉదయభాను రామాపురం క్రాస్ రోడ్డు వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. తెలంగాణలోకి అంబులెన్సుల్ని అనుమతించాలని తెలంగాణ హైకోర్టు చెప్పినా.. పోలీసులు వినకపోవటాన్నితీవ్రంగా తప్పుపట్టారు. దీనికి బదులుగా.. తమ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర సీఎంతో ఫోన్లో మాట్లాడిస్తే.. బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పని ఎందుకు చేయనట్లు?
Tags:    

Similar News