తెలుగు భాషాభిమానులకు ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. హర్షం వ్యక్తం చేసే సంఘటన అని కూడా భావించాలి. ఎక్కడ చూసినా ఇంగ్లిష్ అక్షరాలు, ఇంగ్లిష్ పదాలు, చాలా చోట్ల ప్రభుత్వ ప్రకటనల బోర్డులు సైతం ఇంగ్లిష్ కే తొలి ప్రాధాన్య ఇస్తున్న పరిస్థితులు, ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ జీవోలూ ఇంగ్లిష్ లోనే ఉంటున్నాయనే విమర్శ. ఈ సమయంలో తెలంగాణ హైకోర్టు కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది.
అవును... తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొత్త సంప్రదాయనికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో తొలిసారి తెలుగులో తీర్పు వెలువరించింది. సికింద్రాబాద్ కు చెందిన ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన ఆస్తి వివాదంపై తెలంగాణ హైకోర్టు తొలిసారిగా తెలుగులో తీర్పు వెలువరించింది.
ఈ కేసుకు సంబంధించి జస్టిస్ పి నవీన్ రావు, జస్టిస్ నగేశ్ భీమపాకలతో కూడిన ధర్మాసనం 45 పేజీల తీరుపును మాతృభాషలో వెలువరించింది. ఇదే సమయలో అప్పీల్ కోసం ఇంగ్లిష్ లోనూ తీర్పు చెప్పింది.
ఇలా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తెలుగులో తీర్పు చెప్పడంతో భాషాభిమానులు హర్ష వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విషయాలు తెరపైకి వచ్చినప్పుడైనా... ప్రభుత్వాలు తెలుగుకి ఇవ్వాల్సిన ప్రాధాన్యతపై ఆలోచించాలని సూచిస్తున్నారు.
సాధారణంగా సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో మొత్తం ఇంగ్లీష్ భాషలోనే వ్యవహారాలుంటాయి. పిటిషన్ లు దాఖలు చేసినప్పుడు అనుబంధ డ్యాక్యుమెంట్లు, ఆధారాలు స్థానిక భాషలో ఉన్నప్పటికీ.. వాటిని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్ లెట్ చేసి కోర్టు రిజిస్ట్రీకి సమర్పించాలి. అయితే ఈ మధ్య సుప్రీంకోర్టు కొన్ని కీలక తీర్పులను స్థానిక భాషల్లోకి ట్రాన్స్ లెట్ చేయిస్తోంది.
కాగా... ఈ ఏడాది ఫిబ్రవరిలో కేరళ హైకోర్టు మలయాళంలో తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. దీంతో కేరళ మాతృబాషలో తీర్పు వెలువరించిన హైకోర్టుగా అది రికార్డ్ సృష్టించింది. ఈ సమయంలో స్థానిక భాషల్లో కేరళ తరువాత తీర్పు వెలువరించింది తెలంగాణ హైకోర్టు మాత్రమే కావటం విశేషం.