అధికారికంగా తెలంగాణలో ఎకరం రూ.22.02 కోట్లు.. ఎక్కడెక్కడంటే?

Update: 2022-01-29 07:30 GMT
వ్యవసాయ భూములు.. ఖాళీ స్థలాలు ఇలా తెలంగాణ రాష్ట్రంలో భూముల ఆస్తుల విలువను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రం మొత్తంలో అత్యధిక విలువను ఖరారు చేస్తూ కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకుంది.

 తాజా ఉత్తర్వుల ప్రకారం చూస్తే.. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఒకవైపుగా ఉండే సరూర్ నగర్.. బహుదూర్ పురా మండలాల్లో ఎకరం భూమి రూ.22.02 కోట్లుగా ఉన్న ప్రభుత్వ విలువను ఏకంగా రూ.24.22 కోట్లకు పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

 ఆ తర్వాతి స్థానంలో హైదర్ నగర్ (కుకట్ పల్లి నుంచి మియాపూర్ వెళ్లే ప్రాంతంలో).. కుకట్ పల్లి.. బాలానగర్.. మూసాపేట మండలాల్లో ప్రస్తుతం ఎకరం రూ.18.87 కోట్లుగా ఉంది. అదే సమయంలో కర్మన్ ఘాట్ లో రూ.13.55 కోట్లు. మాదాపూర్ లో రూ.12.58 కోట్లు ఉండగా దాని విలువను మరో 10 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. మరింత భారీగా ఉన్న ధరలన్ని హైదరాబాద్ మహానగరంలోనే ఉండటం గమనార్హం.

ఇక.. ఐటీ కారిడార్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే గబ్చిబౌలి.. మియాపూర్.. నానక్ రాం గూడలో ఎకరం రూ.9.43 కోట్లు.. నిజాంపేట.. అత్తాపూర్ లలో రూ.6.29 కోట్లు.. నాగోల్ బండ్లగూడలో రూ.5.03 కోట్లుగా ఉన్న ప్రభుత్వ భూమి విలువను మరో 20 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను త్వరలో విడుదల చేయనున్నట్లు చెబుతున్నారు.
Tags:    

Similar News