తెలంగాణ రాష్ట్ర సాధనలో బలంగా వినిపించిన నినాదాల్లో ముఖ్యమైనది.. 'విడిపోయి కలిసి ఉందాం'. నిజానికి ఈ నినాదం ఏపీకి చెందిన పలువురు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గళం వినిపించే పరిస్థితిని తీసుకొచ్చింది. ఉద్యమ వేళ వినిపించిన ఈ నినాదం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏమైందన్న సంగతి విషయానికి వస్తే.. తన రాజకీయ అవసరాల కోసం 'ఆంధ్రా' భావోద్వేగాన్ని తట్టి లేపే ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యమా అని అడుగు ముందుకు పడలేదనే చెప్పాలి. తనకు నచ్చినప్పుడు ఒకలా.. నచ్చనప్పుడు మరోలా వ్యవహరించే సీఎం కేసీఆర్.. 'ఆంధ్రా'ను తనకు తగ్గట్లుగా మాట్లాడటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఆసక్తికర సన్నివేశం ఒకటి ఏపీలో చోటు చేసుకుంది. తాజాగా జగన్ కేబినెట్ 2.0లో తెలంగాణ ప్రాంతానికి చెందిన విడుదల రజనీని మంత్రిగా నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకోవటం.. ఆమె ప్రమాణ స్వీకారం ఇప్పుడు ఆసక్తికర రాజకీయ పరిణామానికి తెర తీసినట్లుగా చెప్పాలి. విభజన తర్వాత.. రెండు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి చూస్తే.. నేతల పుట్టుపూర్వొత్తాలకు పెద్ద పీట వేయటం కనిపిస్తుంది. ఏపీతో పోలిస్తే తెలంగాణలో ఇది ఎక్కువగా కనిపించటం తెలిసిందే.
అప్పుడెప్పుడో నలభై యాభై ఏళ్ల క్రితం తెలంగాణలో ఉంటున్నా.. ఏపీ మూలాల్ని వెతికి వేలెత్తి చూపే అలవాటు ఎక్కువైంది. ఇలాంటివేళలో.. దశాబ్దాల తరబడి తెలంగాణలోనే ఉంటున్నా.. ఆంధ్రా మూలాల్ని ఎత్తి చూపటం ఏమిటన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ఇలాంటివేళ.. ప్రాంతాలకు అతీతంగా రాజకీయాలు ఉండాలన్న విషయాన్ని జగన్ 2.0 మంత్రివర్గం స్పష్టం చేసింది. ఏపీలో తెలంగాణ మూలాలు ఉన్న వ్యక్తి మంత్రి అయినప్పుడు.. తెలంగాణలో ఏపీ మూలాలు ఉన్న నేత మంత్రి ఎందుకు కాకూడదన్నది ఇప్పుడు చర్చగా మారింది.
తెలంగాణలో.. అందునా హైదరాబాద్ మహానగరంలో ఏపీ మూలాలు ఉన్న వారు భారీ ఎత్తున ఉన్నప్పుడు.. వారంతా తెలంగాణలో ఇమిడిపోయి బతికేస్తున్నప్పుడు.. ఆ ప్రాంతానికి చెందిన వారన్న బూచి చూపించకుండా.. పదవులు అప్పజెప్పాల్సిన అవసరం ఉందంటున్నారు.
ఏపీలో మంత్రి కావటానికి తెలంగాణ మూలం సమస్య కానప్పుడు.. తెలంగాణలో ఏపీ మూలాలు మంత్రి పదవి అందుకోవటానికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. ఈ తరహా ప్రయోగం చేస్తే.. గులాబీ బాస్ కేసీఆర్ మాత్రమే చేయాలని.. భావోద్వేగాల్ని తట్టి లేపే ఆయన.. తన మంత్రివర్గంలో ఏపీ మూలాలు ఉన్న నేతకు అవకాశం ఇవ్వటం ద్వారా.. కొత్త తరహా రాజకీయాలకు తెర తీయాలని కోరుతున్నారు.
కేసీఆర్ అయితే.. తన నిర్ణయానికి పదునైన వాదనను వినిపించటం ఖాయం. తెలంగాణలో మమేకమైన ఏపీకి చెందిన వారిలో కొందరికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తే.. విడిపోయి కలిసి ఉందామన్న ఉద్యమ నినాదం అతికినట్లుగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. సీఎం కేసీఆర్ ఈ తరహా నిర్ణయాన్ని తీసుకుంటారా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. మరేం జరుగుతుందో చూడాలి.