తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కల అనే టాస్కు.. బడా బడా కంపెనీలకు సైతం సవాలుగా మారింది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా కొత్త సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని.. అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసే సచివాలయ భవంతి తన విజన్ కు కేరాఫ్ అడ్రస్ అన్నట్లు ఉండాలన్న ఆలోచనలో ఆయన ఉండటం తెలిసిందే. ఏం చేసినా భారీగా చేయటం.. మిగిలిన వారు అసూయ పడేలా ప్లాన్ చేయటం కేసీఆర్ కు అలవాటే. తన డ్రీం ప్రాజెక్టు అయిన కొత్త సచివాలయానికి సంబంధించి ఆయన పెట్టిన పరిమితులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
కొత్త సచివాలయాన్ని యుద్ధ ప్రాతిపదికన కేవలం ఏడాది వ్యవధిలోనే పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు. అలా అని.. ఇష్టారాజ్యంగా ఖర్చుపెట్టటానికి లేదు. ఇన్ని పరిమితుల మధ్య పని చేయటానికి ఓకే మరి.. ముందుగా అడ్వాన్సు ఏమైనా ఇస్తారా? అని అడిగితే.. అందుకు నో అని నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. సరే.. ఏ నెలకు ఆ నెల చేసిన పనికి డబ్బులు ఇచ్చే అవకాశం ఉందా? అని అడిగినా.. చెప్పలేమన్న సమాధానం. ఇలాంటి వేళలో.. అతి తక్కువ వ్యవధి (ఏడాది)లో అంత భారీ భవనాన్ని నిర్మించటమా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. సచివాలయ నిర్మాణ ప్రాజెక్టును సొంతం చేసుకోవటానికి పెద్ద కంపెనీలే రంగంలోకి దిగాయి.
టాటా ప్రాజెక్ట్స్.. షాపూర్జీ పల్లంజీ.. జేఎంసీ ప్రాజెక్టు.. ఎన్ సీసీ.. కేపీసీ ప్రాజెక్ట్స్ లాంటి దిగ్గజాలు కేసీఆర్ కలను సాకారం చేసేందుకు ముందుకు వచ్చాయి. అయితే.. తమకు సంబంధించి కొన్ని మినహాయింపులు ఇవ్వాలని వారు బేరసారాలు ఆడుతున్నారు. అందుకు కేసీఆర్ సర్కారు మాత్రం ససేమిరా అంటోంది. ఇంత భారీ నిర్మాణానికి ఏడాది కాదు.. మరో ఆర్నెల్లు అదనంగా గడువు పెంచుతారా? అంటే.. అన్ని లెక్కలు వేసుకున్న తర్వాతే ఏడాది టైం అని ఫిక్స్ చేశామని ప్రభుత్వం చెబుతోంది. ఈ మాటలతో కేసీఆర్ కలను వాస్తవ రూపంలోకి తీసుకురావటం భారీ టాస్కుగా నిర్మాణ కంపెనీలు భావిస్తున్నాయి. మరి.. ఆ టాస్కు ఎవరికి సొంతమవుతుందో చూడాలి.