వాళ్లలో వాళ్లు కొట్టుకుంటారు.. బయటోడు వస్తే మాత్రం కలిసి ఎగబడుతారు.. ఏదో గిరిజన గూడాల సంగతి కాదు చెప్పేది.. ఘనత వహించిన మన కాంగ్రెస్ పార్టీ దుస్థితిదీ. అవును ఇప్పుడు కాంగ్రెస్ లో 'రెడ్డి రాజకీయం' పీక్ స్టేజ్ లో నడుస్తోంది.
తాజాగా పీసీసీ చీఫ్ రేసు తెలంగాణ కాంగ్రెస్ సెగలు పుట్టిస్తోంది. ఈ పోస్టు కోసం దాదాపు 10 మంది వరకు పోటీ పడుతున్నారు. వింతైన దరఖాస్తులు, కోరికల తో తాజాగా సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా పీసీసీ బరిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అయితే తాజాగా ఆయన చేసిన కామెంట్ ఆసక్తి రేపుతోంది. ‘పదవీ కోసం పోటీపడుతున్న రెడ్డి సామాజికవర్గం నాయకులంతా ఒక సమావేశం పెట్టుకొని, ఒక నాయకుడి పేరును ఏకగ్రీవంగా ఖరారు చేయాలని’ జగ్గారెడ్డి హైదరాబాద్ లో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశంలో ఓ ప్రతిపాదన పెట్టాడట.. రెడ్డి సామాజికవర్గం నాయకులందరూ పీసీసీ అధ్యక్ష పదవి కి అర్హులే అని ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కల్లోలానికి దారితీశాయి..
తెలంగాణ కాంగ్రెస్ లో ఎంతో మంది ఉద్దండ పిండాలున్నారు. ముఖ్యంగా బీసీ వర్గానికి చెందిన మన వీహెచ్ తాతా.. ఇప్పటికే 80+ వయసులోనూ అర్జున్ రెడ్డిలా బుల్లెట్ నడిపిస్తూ కాంగ్రెస్ ఐకాన్ గా కార్యకర్తలు నేతలను ఉరకెలెత్తిస్తున్నాడు. ఇక శ్రీధర్ బాబు కూడా సాఫ్ట్ నేతగా అందరితోనూ కలిసిపోయే రెడ్డియేతర నేతగా పేరొందారు.. వీరే కాదు.. కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత ఎస్సీ వర్గానికి చెందిన 'భట్టి' కూడా పీసీసీ రేసులో ఉన్నారు.. ఇంకా చాలా మంది దళిత, బీసీ వర్గాల నేతలు ఈసారి పీసీసీ పదవిని తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే తరతరాలుగా తెలంగాణ కాంగ్రెస్ పై ఆధిపత్యం చెలాయిస్తున్న సీనియర్ రెడ్డి నేతలంతా తమలో తమకే ఇవ్వాలని ఇలా ప్రతిపాదించిన వైనం సెగలు రేపుతోంది. పార్టీ కి అండగా ఉంటున్న బీసీలు, ఎస్సీ నేతల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. మరి రెడ్డి లలో ఐక్యత ఉందా అంటే అదీ లేదు.. పీసీసీ పీఠం కోసం ఉత్తమ్, కోమటిరెడ్డి బ్రదర్స్ కొట్టుకున్నారు. ఇక రేవంత్ కు ఇద్దామంటే రేవంత్ వర్సెస్ నల్గొండ రెడ్డి నేతల వార్ నడిచింది. ఇలా రెడ్డీ నేతలు ఇతరులకు ఇవ్వడానికి ఒప్పుకోకుండా తమలో తాము అంగీకరించకుండా చేస్తున్న రాజకీయం తెలంగాణ కాంగ్రెస్ లో వేడి పుట్టిస్తోంది.