ఉద్యోగం ఇవ్వడం లేదు..ఆత్మహత్యకు అనుమతించండి..రాష్ట్రపతి - ప్రధానికి సింగరేణి నిర్వాసితుడి లేఖ

Update: 2020-10-11 04:02 GMT
సింగరేణిలో ఉద్యోగం ఇవ్వడం లేదని ఓ  నిర్వాసితుడు ఏకంగా ప్రధాని, రాష్ట్రపతికి లేఖ రాశారు. అందులో ఉద్యోగం వచ్చే పరిస్థితి కనిపించడం లేదని అందుకే ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరాడు. ఇది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సింగరేణి ఏరియాల్లోని ఎస్టీ నిర్వాసితులకు జీవో 34 ప్రకారం  సింగరేణి యాజమాన్యం ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. అ యితే కొద్ది రోజులుగా ఆ సంస్థ నిర్వాసితులకు  
ఉద్యోగాలు ఇవ్వడం లేదని నిర్వాసితుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన నిర్వాసితుడు ఇస్లావత్‌ దిలీప్ కుమార్‌  ఆరోపించాడు. ఉద్యోగం ఇవ్వని పక్షంలో  తనకు ఇక ఆత్మహత్యే శరణ్యమని, ఇందుకు అనుమతివ్వాలని  అతడు  ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు లేఖలు రాశాడు.

శనివారం ఈ విషయమై ఆయన మీడియాతో  మాట్లాడాడు. సింగరేణి ఇల్లెందు ఏరియాలో ఎస్టీ నిర్వాసితులకు జీవో 34 ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆదేశాలున్నాయని తెలిపాడు. కాని జీవోను యాజమాన్యం  పట్టించుకోవడం లేదని నిర్వాసితులకు న్యాయం జరగడం లేదని చెప్పారు. ఇన్నాళ్లు ఎలాగైనా అక్కడ ఉద్యోగం వస్తుందనే ఆశ ఉండేదని.. సింగరేణి సంస్థ వ్యవహరిస్తున్న తీరుతో తనకు ఇక ఉద్యోగం వచ్చే పరిస్థితి కనిపించడం లేదని  ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదని.. అందుకే దీనికి అనుమతి ఇవ్వాలని  ప్రధానితో పాటు రాష్ట్రపతికి లేఖలు రాశానని చెప్పాడు. నిర్వాసితుడి లేఖతో వారికి జరుగుతున్న అన్యాయం పై చర్చనీయాంశమైంది.
Tags:    

Similar News