విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో సామాజికవర్గాలకు కల్పించే రిజర్వేషన్ల పరిమితి నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలకే అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. ఈ మేరకు తాజాగా సుప్రీంకోర్టుకు లేఖ రాసింది.
దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు సామాజిక పరిస్థితులు ఉన్నాయని.. అందువల్ల రిజర్వేషన్లపై నిర్ణయాధికారం రాష్ట్రాలకే అప్పగించాలని తెలంగాణ సర్కార్ కోరింది.
1992లో ఇందిరాసాహ్నీ కేసులో సామాజికవర్గాలకు, ఆర్థిక ప్రతిపాదన కల్పించే రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదని ఇచ్చిన తీర్పును పున: సమీక్షించాలని తెలంగాణ సర్కార్ కోరింది.
కాగా ఇటీవలే రిజర్వేషన్లపై తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. రిజర్వేషన్ల పెంపు వెసులుబాటు రాష్ట్రాలకే ఉండాలని.. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాస్తానని తెలిపారు. అన్నట్టుగానే సుప్రీంకోర్టుకు లేఖ రాసి సంచలనం సృష్టించారు.