భవిష్యత్తుపై గంపెడాశలతో ఉద్యోగరీత్యా అమెరికాకు వెళ్లిన తెలంగాణ యువకుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. డల్లాస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిసేస్తోన్న కృష్ణ చైతన్య శుక్రవారం నాడు అతడు పేయింగ్ గెస్ట్ గా నివాసముంటున్న ఫ్లాట్ లో మరణించినట్లు అపార్ట్ మెంట్ యజమానులు తెలిపారు. శుక్రవారం ఉదయం కృష్ణ చైతన్య ఎంత సేపటికి గది నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన యజమానులు ....పోలీసులకు సమాచారమందించారు. అతడి గది తలుపులు బద్దలు కొట్టి లోపలకు వెళ్లిన పోలీసులకు బెడ్ పై కృష్ణ చైతన్య విగత జీవిగా కనిపించాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సిద్ధిపేటలోని ప్రశాంత్ నగర్ కు చెందిన కృష్ణ చైతన్య కొంతకాలం నుంచి అమెరికాలోని డల్లాస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. డల్లాస్ లో ని ఓ అపార్ట్ మెంట్ లో పేయింగ్ గెస్ట్ గా ఉంటున్నాడు. అయితే, శుక్రవారం నాడు కృష్ణ చైతన్య రోజులాగా బయటకు రాకపోవడంతో యజమానులు.... పోలీసులకు సమాచరమందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే, పోలీసుల విచారణలో ఇప్పటివరకు అతడి మృతికి గల కారణాలు తెలియరాలేదు. మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తవగా, రిపోర్టు వివరాలు తెలియాల్సి ఉంది. మంత్రి హరీశ్ రావు.... కృష్ణ చైతన్య మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు అమెరికాలోని తెలంగాణవాసులతో మాట్లాడుతున్నారు. గురువారం ఉదయానికి కృష్ణ చైతన్య మృతదేహం భారత్ కు తెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.